Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

432

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

1798 లార్డు (మార్నింగ్ ట౯ ) వెలస్లీ గవర్నరుజనరలగుట.

1799 నాలుగవ మైసూరుయుద్ధము. శ్రీరంగపట్నము నింగ్లీషువారు పట్టుకొనుట, టిప్పుసుల్తాను మరణము ; సీరంపూరులో బాప్టిస్టు మిషనరీయగు క్యారీ క్రైస్తవ (ప్రచారసంఘము) మిషను స్థాపించుట.

1800 నానాఫర్నవీసు మరణము.

1802 పూనాయుద్ధము. మహారాష్ట్రుల వ్యవహారములందు కంపెనీవారు కలుగజేసికొనుట. బెస్సీనుసంధి. మద్రాసులో పర్మనెంటు సెటిల్మెంటు.

1803 రెండవ మహారాష్ట్రయుద్ధము, ఢిల్లీ, అస్సాము, లాస్వారి, ఆర్గానుల యుద్దములు.

1804 హోల్కారుతో యుద్ధము. మాన్స౯ ఓడిపోవుట. డిగ్గు పట్టుపడుట. నెపోలియను ఫ్రెంచి సామ్రాజ్యమునకు చక్రవర్తియగుట.

1805 భరతపురము ముట్టడి వ్యర్ధమగుట. వెలస్లీని కంపెనీవారు వెనుకకు రమ్మనుట.

1805 ఆగస్టు, సెప్టెంబరులలో కార౯ వాలిసు ప్రభువు గవర్నరుజనరలగుట. అక్టోబరులో సర్ జార్జి బార్లో ఆక్టింగు గవర్నరుజనరలగుట.

1806 వెల్లూరులో సిపాయిల పితూరీ.

1807 మింటోప్రభువు గవర్నరుజనరలగుట.

1808 మాల్కలం పెర్షియాకు, ఎల్‌ఫి౯స్ట౯ కాబూలుకు, రాయబారులుగా పంపబడుట. తిరువాంకూరులో గొప్ప తిరుగుబాటు.

1809 రంజితసింగు దగ్గరకు మెట్కాఫ్ రాయబారిగ పంపబడుట. అమృతసరు సంధిజరుగుట. మద్రాసు కంపెనీయుద్యోగుల పితూరీ.

1810 మొల్యుక్కా స్ పట్టుబడుట.

1811 జావాద్వీపము జయింపబడుట.

1813 లార్డు హేస్టింగ్సు గవర్నరుజనరలగుట. తూర్పుఇండియా కంపెనీవారికి క్రొత్త అధికారములతో పట్టా ఇవ్వబడుట.

1814-16 నేపాళ యుద్ధము .

1817-19 పిండారీయుద్ధము. మహారాష్ట్రయుద్ధము.

1817 కర్కీ, సీతాబాల్డీ నాగపూరు, మహిద్‌పూరు, యుద్ధములు.