సంవత్సరములవారీ చరిత్ర
433
1817 డేవిడ్‌హేర్, రామమోహనరాయిగార్లు కలకత్తాలో హిందూకాలేజి స్థాపించుట. రామమోహనరాయల సంఘసంస్కరణ ప్రయత్నములు.
1818 కొరిగో౯, అష్టియుద్ధములు, వంగభాషలో మొదటి వార్తాపత్రిక. వంగరాష్ట్ర ప్రవాసముల 'III వ రిగ్యులేషను' శాసింపబడుట.
1819 మధ్య రాష్ట్రములందు శాంతి నెలకొల్పబడుట. సింగపూరు స్థాపనము. అయోధ్యనవాబు అయోధ్యరాజుగ ప్రకటింపబడుట.
1820 సర్ తామస్ మన్రో మద్రాసు గవర్నరగుట.
1821 నెపోలియ౯ మరణము. మద్రాసులో రైత్వారీపద్ధతి పూర్తియగుట.
1823 (జనేవరు-జూలై మధ్య) జా౯ ఆడం, ఆక్టింగు గవర్నరుజనరలగుట.
1823 ఆగష్టులో అమ్హరెస్టు ప్రభువు గవర్నరుజనరలగుట
1824 బర్మా యుద్ధము. బ్యారక్‌పూర్ పితూరీ. హరిశ్చంద్ర ముఖర్జీ జననం.
1825 శ్రీ దయానందసరస్వతి - దాదాభాయి నౌరోజీల జననము.
1826 భరతపురమును కొల్లగొనుట. యండబూ సంధి; బర్మాయుద్ధ సమాప్తి.
1827 సర్ తామస్ మన్రో మరణము. తెలుగున తొలిగ్రంథముద్రణము.
1828 విలియం బెంటింకు ప్రభువు గవర్నరుజనరలగుట. రామమోహనరాయలు కలకత్తాలో బ్రహ్మసమాజ ప్రార్ధన మందిరమును స్థాపించుట.
1829 వంగరాష్ట్రమున సహగమన నిషేధము. థగ్గుల నేరములు శిక్షార్హమగుట. ఏ. ఓ. హ్యూముగారి జననము. గ్రీసుదేశ స్వాతంత్ర్యము.
1830 మద్రాసు బొంబాయిలలో సహగమనము నిషేధింపబడుట. ఢిల్లీ చక్రవర్తి తరఫున ఇంగ్లాండుకు రాజా రామమోహనరాయల రాయబారము. ఇంగ్లాండులో నాల్గవ విలియం రాజు పట్టాభిషేకము.
1831 మైసూరు రాజును పదచ్యుతునిగజేసి ఆంగ్లేయులు మైసూరును ట్రస్టీలుగా వశముజేసికొనుట. గవర్నరుజనరలు రంజత్ సింగుల సమావేశము.
1833 రాజా రామమోహనరాయల నిర్యాణము ( సెప్టెంబరు 27). తూర్పుఇండియా కంపెనీకి రాజ్యధికారపట్టా మరల నివ్వబడుట.
1834 శ్రీ రామకృష్ణపరమహంస జననము (ఫిబ్రవరి 20)
1835 సర్ చార్లెస్ మెట్కాఫ్ ఆక్టింగు గవర్నరుజనరల్ - పత్రికలకు స్వాతంత్ర్యము. దోస్తుమహమ్మదు అఫ్‌గనిస్థానముకు అమీరగుట.
1836 ఆక్లండు ప్రభువు గవర్నరుజనరలగుట.