పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరములవారీ చరిత్ర

431

1775 మొదటి మహారాష్ట్రయుద్ధము; నందకుమారుడు ఊరిదీయబడుట.

1776 అమెరికా సంయుక్తరాష్ట్రముల స్వాతంత్ర్య ప్రకటన (జూలై 7).

1778 ఫ్రాన్సుతో యుధ్ధము, ఫ్రెంచివారి పట్టణములు పట్టుకొనబడుట.

1779 వార్గాను (Wargaon) కన్వెన్షను; మైసూరుతో యుధ్ధము.

1780 పోహాము గ్వాలియరును పట్టుకొనుట. హైదరాలీ కర్నాటకముపైకి దండెత్తివచ్చుట. బెయిలీసైన్యము నాశనము చేయబడుట.

1781 పోర్టోనోవో యుద్ధమున సర్ ఐర్ కూటు జయించుట. వారన్ హేస్టింగ్సు, కాశీరాజగు చైత్ సింగుపట్ల జరిపిన తంత్రము.

1782 వారన్ హేస్టింగ్సు, ఆయోధ్యబీగములను హింసించుట. మద్రాసుదగ్గర ఫ్రెంచివారి నౌకాదళములు విజృంభించుట. హైదరాలీ మరణించుట.

1783 వెర్ సెయిల్ సు సంధి. ఫ్రెంచివారికి ఇంగ్లీషువారికి రాజీ.

1784 మంగుళూరు సంధి. టిప్పుసుల్తానుతో సంధి. పిట్టుచట్టము అనబడు ఇండియా రాజ్యాంగ చట్టము శాసింపబడుట.

1785 వారన్ హేస్టింగ్సు గవర్నరుజనరలు పనిని మానుకొనుట. సర్ జాన్ మెక్ఫర్ స౯ ఆక్టింగు గవర్నరుజనరలగుట.

1786 కార౯ వాలిస్ ప్రభువు గవర్నరుజనరలగుట.

1787 మహదాజీ సింధియాకును మహారాష్ట్రులకును అపజయములు కలుగుట.

1788 వార౯ హేస్టింగ్సు పైన నేరారోపణ; విచారణ.

1789 ఫ్రెంచిదేశములో విప్లవ ప్రారంభము .

1790 మూడవ మైసూరు యుద్ధము.

1792 శ్రీరంగపట్నము సంధి.

1793 వంగరాష్ట్రమున పర్మనెంటు సెటిల్మెంటు (శాశ్వత పైసలా). ఈస్టిండియా కంపెనీవారి వ్యాపారపట్టా మరల ఒసగబడుట.

1794 మహదాజీసింథియా మరణము .

1795 సర్ జాన్‌షోరు గవర్నరుజనరలగుట. వార౯ హేస్టింగ్సు నిర్దోషియని తీర్పు. రాణీ అహల్యాబాయి మరణము. బెనారసులో పర్మనెంటు సెటిల్మెంటు, మహారాష్ట్రులు నైజామును కార్‌డ్లాదగ్గర నోడించుట.