Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

430

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

1756 ఏడేండ్లయుద్దము ఐరోపాలో ప్రారంభమగుట. వంగరాష్ట్రనవాబు సురాజుద్దౌలా కలకత్తాను పట్టుకొనుట.

1757 ఇంగ్లీషువారు చంద్రనగరమును పట్టుకొనుట. ప్లాసీయుద్దము. మీర్జాఫరు వంగరాష్ట్రనవాబుగ చేయబడుట.

1758 బొబ్బిలియుద్దము. ఫ్రెంచిసేనానియగు లాలీ మద్రాసు పట్టుకొనలేకపోవుట. ఫోర్డు ఉత్తర సర్కారులపైబడుట.

1759 ఫోర్డు బిదెర్రాదగ్గర డచ్చివారి నోడించుట. షా అలం చక్రవర్తియగుట.

1760 వాన్సిటార్టు వంగరాష్ట్ర గవర్నరగుట. దక్షిణ హిందూస్థానమున వందవాశి దగ్గర ఫ్రెంచివారు కడపటిసారి ఓడింపబడుట. మీర్జాఫరు బదులు వంగరాష్ట్రమున మీర్ఖాసీము నవాబుగ జేయబడుట.

1761 మూడవ పానిపట్టు యుద్ధమున మహారాష్ట్రుల ఆఫ్‌గనుల నోడించుట. పాండుచేరీపడుట హైదరాలీ మైసూరు పరిపాలకుడగుట.

1763 ప్యారిసుసంధి. ఏడేండ్లయుద్ధ మంతమగుట, మీర్ఖాసీము పాట్నాలో ఐరోపావారిని వధించుట. మీర్జాఫరు మఱల నవాబుగచేయబడుట.

1764 మీర్ఖాసీము బక్సారుదగ్గర ఓడింపబడుట.

1765 మీర్జాఫరు మరణము. క్లైవు వంగరాష్ట్ర గవర్నరగుట. కంపెనీవారు మొగల్ చక్రవర్తివల్ల వంగరాష్ట్ర బీహారు ఒరిస్సాల “దినానీగిరీ"ని సంపాదించుట.

1767 హైదరాలీతో యుద్ధము. క్లైవు సీమకుపోవుట. వెరల్‌స్టు వంగరాష్ట్ర గవర్నరగుట.

1769 కార్టియరు వంగరాష్ట్ర గవర్నరగుట, మద్రాసు సంధివలన హైదరాలీతోడి యుద్ధ మంతమగుట.

1770 వంగరాష్ట్రమున ఘోరమైన కఱవు.

1772 వారన్ హేస్టింగ్సు వంగరాష్ట్ర గవర్నరగుట.

1773 రెగ్యులేటింగు ఆక్టు.

1774 రోహిలాయుద్ధము.

1774 వారన్ హేస్టింగ్సు మొదటిగవర్నరుజనరలగుట కలకత్తాలో సుప్రీముకోర్టు స్థాపింపబడుట