పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరములవారీ చరిత్ర

429

1700 కలకత్తా ఒక రాజధానిగా చేయబడుట.

1702 ఇంగ్లీషు పోటీకంపెనీలు రెండును రాజీపడి ఏకమగుట.

1707 ఔరంగజేబు నిర్యాణము-బహదూర్ షా చక్రవర్తియగుట.

1712 ఫరుక్‌ షయ్యరు చక్రవర్తియగుట.

1713 బర్కు మహాశయుని జననము. (జనేవరు 1)

1714 మొగలాయి దర్బారుకు సర్మన్ రాయబారము.

1726 అన్ని రాజధాని నగరములందుసు 'మేయరు కోర్టు'లు స్థాపింపబడుట.

1727 పీష్వా మహారాష్ట్ర రాజ్యాధిపత్యమును వహించుట.

1739 మహారాష్ట్రులు మాళవమును జయించుట. పెర్షియా దేశమునుండి నాదిర్ షా దండెత్తివచ్చి ఢిల్లీని కొల్లగొనుట.

1742 ఫ్రెంచి రాజనీతిజ్ఞుడగు డూప్లే పాండుచేరీకి గవర్నరగుట.

1744 ఆస్ట్రియా రాజ్య వారసత్వయుద్ధము.

1746 ఇంగ్లీషువారికి ఫ్రెంచివారికి హిందూదేశ తూర్పుతీరమున నౌకాయుద్ధము జరుగుట. ఫ్రెంచివారు మద్రాసును పట్టుకొనుట.

1748 ఇంగ్లీషువారు పాండుచేరిదగ్గర అపజయముగాంచుట. నైజాం ఉల్ ముల్కు మరణము; శివాజీ మనుమడగు షాహూ మరణించుట.

1749 'ఎయిక్సులాఛాపెల్' సంధివలన ఇంగీషువారికి ఫ్రెంచివారికి రాజీజరుగుట. మద్రాసు ఇంగ్లీషువారికి వశమగుట. తంజావూరు రాజ్య వారసత్వ తగవులో ఇంగ్లీషువారు కలుగజేసికొనుట, కర్నాటకనవాబు మరణము. డూప్లే రాజ్యనీతి సఫలమగుట.

1750 దక్షిణ హిందూస్థానమున నైజాముయొక్కయు, కర్నాటక నవాబు యొక్కయు వారసత్వము విషయమున యుద్ధములు ప్రారంభమగుట. డూప్లే కర్నాటక పరిపాలకుడగుట.

1751 క్లైవు ఆర్కాటును సంరక్షించుట.

1752 ఫ్రెంచివారు తిరుచునాపల్లి ముట్టడిని మానుట, చందా సాహెబు ఉరిదీయబడుట.

1754 డూప్లేను ఫ్రెంచివారు వెనుకకు రమ్మనుట. ఫ్రెంచివారికిని ఇంగ్లీషువారికిని దక్షిణ హిందూస్థానమున శాంతికలుగుట,