పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

420

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


మున కాంగ్రెసువారు చేసినసేవ యప్రతిమానముగా నుండెను. రాజేంద్రప్రసాదుగారు అనారోగ్యముగానుండికూడ నడుముకట్టి చాలశ్రమపడెను. ఆయన ప్రారంభించిన భూకంప నష్ట నివారణనిధికి ప్రభుత్వమువారినిధికివలె సంస్థానాధీశులు ధనవంతులుమాత్రమేకాక జనసామాన్యముగూడ విరాళము లొసగసాగెను. దీనివలన కాంగ్రెసు పట్ల ప్రజలకుగల భక్తి విశ్వాసములు వెల్లడియయ్యెను. నాటికింకను కాంగ్రెసు ప్రభుత్వముతో పోరాడుచున్నను, ఈవిపత్సమయమున ప్రభుత్వముతో కలసి పనిచేయుటవలన కాంగ్రెసుకు దేశప్రజల క్షేమము తప్ప ప్రభుత్వముతోడి విరోధము ప్రధానము కాదని వెల్లడి యయ్యెను. గాంధిమహాత్ము డారంభించిన హరిజనోద్యమము నందుగూడ కాంగ్రెసుసేవకు లత్యంతోత్సాహముతో పనిచేసిరి. దేశమెల్లయెడల అస్పృశ్యతా నివారణ ప్రయత్నములు జరుగసాగెను. మహాత్ముని పర్యటనము ప్రజలలో నూతనోత్సాహము కలిగించెను. ఈ ఉత్సాహమును పలుకుబడిని చూచి ప్రభుత్వమువారు వెరగందిరి.

ఇంతలో కేంద్రశాసనసభలకు ఎన్నికలు వచ్చెను. ఈ సమయమునందు కాంగ్రెసు ప్రాతపద్ధతులను మార్చి శాసనసభలో ప్రవేసింపవలెనను అభిప్రాయము దేశములో వ్యాపించెను. ఏలన కాంగ్రెసువారు జైళ్ళలో నుండగా శాసనసభలో చేరిన ఆసాములు గవర్నమెంటు చేయుచుండిన స్వాతంత్ర్యనిరోధక - ఆర్డినెన్సులను అత్యాచారములను ఖండించి విమర్శింపక పోవుటయేగాక ఆ క్రూరనిబంధనలెల్ల శాస