పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెస్ ప్రభుత్వోదయము

419


బ్రిటిషు పార్లమెంటువారికి చెప్పివేసెను. ఇది నిజమని పార్లమెంటు రాజనీతిజ్ఞులు విశ్వసించిరి. అతడు కాంగ్రెసు సంస్థలనెల్ల అక్రమసంఘములుగా ప్రకటించి ప్రజాభిప్రాయ ప్రకటనముల నణచివేసి ఆర్డినెన్సులమూలమున పాలింపసాగెను. ఇంతటితో తృప్తిజెందక తీవ్రనిర్బంధశాసనములనెల్ల శాసనసభలో ప్రవేశపెట్టి బలవంతముగా చట్టములుగా జేయించెను. అందువలన దేశమెల్ల ఒకవిధమగు సైనిక శాసనముక్రింద నుండెనని చెప్పవచ్చును. ఇన్నినిర్బంధములు చేసియుంచి కాంగ్రెసులోని సామాన్యులను కారాగారములనుండి వదలినను ఇక భయములేదని గ్రహించి అట్లుచేసి 'చూడు నా మహిమ' అని యనసాగెను. ప్రజలు లోలోపల బాధపడుచుండిరి. ఈ దుస్థితినిచూడగా కాంగ్రెసువారికే చాల కష్టముగానుండెను. దేశపరిస్థితులను బట్టి కాంగ్రెసు బహిరంగ సత్యాగ్రహమును వదిలి రహస్య మార్గములను అవలంబించవలసివచ్చెనను సంగతి గాంధీమహాత్మునకు తెలిసెను. ఈ రహస్యపద్ధతులకు మహాత్ము డంగీకరింపక సత్యాగ్రహము సత్యవ్రతమైనందున రహస్యమార్గములు పనికిరావనియు అట్లు బహిరంగముగా జరుపుటకు వీలులేనిచో దాని నాపవలెననియు సలహానిచ్చెను. 1934 ఏప్రియలులో సత్యాగ్రహము తాత్కాలికముగా విరమింపబడెను.

II

1934 సంవత్సరం జనేవరి 15 వ తేదీన బీహారులో గొప్ప భూకంపముకలిగి చాలమంది మరణించిరి. ఆస్తిని గోల్పోయిరి. ఈ విపత్సమయమున రాజేంద్రప్రసాదుగారి నాయకత్వ