కాంగ్రెస్ ప్రభుత్వోదయము
421
నము లగుటకు తాము తోడుపడి దేశమునకు తీరని అన్యాయము చేసియుండిరి. ఇదిగాక భారతదేశ ప్రజలకు నష్టకరములును బ్రిటిషుసామ్రాజ్యలాభ విధానమునకు తోడ్పడునవియు నగు ఆర్థిక విధానములను గూడ ఆమోదించియుండిరి. ఇట్లు స్వాతంత్ర్యోద్యమమునకును దేశక్షేమమునకును అడ్డుపడు నట్టివారు శాసనసభలయం దుండుట దేశమునకు శ్రేయము కాదనియు కాంగ్రెసువారు ఈఅన్యాయపు నిర్భంధశాసనములను రద్దుచేయుటకు ప్రయత్నించుటకును, వీలైనచో స్వాతంత్ర్యమునకు తోడ్పడగల శాసనములు తీర్మానములు చేయుటకును, క్రొత్తరాజ్యాంగమున కడ్డుపడుటకును, నిర్మాణకార్యక్రమమునకు తోడ్పడుటకును, శాసనసభలలో ప్రవేశింపవలయునని తీర్మానించిరి. కావున కాంగ్రెసు అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయ నిశ్చయించెను. ఈ ఎన్నికలకొఱుకు దేశములో గొప్ప ప్రచారము జరిగెను. అసెంబ్లీలో నిదివరకుండిన బ్రిటిషు సామ్రాజ్య ప్రభుత్వాభిమానులు, ధనవంతులు, బిరుదులుగలవారు తమఅధికార బలమును ధనబలము నుపయోగించి పనిచేసిరి. అసెంబ్లీసభకు అధ్యక్షుడుగా నుండి సామ్రాజ్యాభిమానియగు సర్ షణ్ముఖం చెట్టిగారి అభ్యర్థిత్వముసకు ప్రభుత్వాధికారులనేకులు సాయము చేయజొచ్చిరి. విల్లింగ్ డన్ ప్రభువు కాంగ్రెసు నణచెనో లేదో తెల్పుటకును కాంగ్రెసుకు పలుకుబడియున్నదో లేదో తెలుపుటకును ఇది యదనుగానుండెను. షణ్ముఖంచెట్టిగా రోడిపోయిరి. ఇటులుచాలమంది ప్రభుత్వాభిమానుల ఊరుపేరు