పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

418

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


క్షించు సంస్థలో కాబట్టి యవి జాతీయసంస్థలుకావు. ప్రజలలో నీ సంస్థలకును ఈరాజకీయ పక్షములకును ఎట్టిపలుకుబడియు లేదు. వీనికి వాక్శూరత్వముతప్ప కార్యశూరత్వము లేనేలేదు. దాన ప్రజలలో జాతీయోద్యమమును మేలుకొలిపి తీవ్రముగా పోరాడు కాంగ్రెసుసంస్థను అణచివేసినచో ప్రజలు అసహాయులై బ్రిటిష్‌వారికి విధేయులై యుందురు. దాన బ్రిటిష్ రాజ్యతంత్రజ్ఞులు తమకిచ్చవచ్చినట్లు శాశ్వతముగా దేశము నేలవచ్చును. తమ కిచ్చవచ్చిన రాజ్యాంగవిధానమును స్థాపింపవచ్చును. ఇదియే బ్రిటిషు సామ్రాజ్యవాదుల యూహ. అందువలననే 1932 లో విల్లింగ్డను ప్రభువు కాంగ్రెసును ఆరు వారములలో అణచివేసెదననగా సంతసించి అందుకొర కతడు అవలంబించిన క్రూరపద్ధతులను అత్యాచారములను బ్రిటిషు సామ్రాజ్యము వారామోదించిరి. విల్లింగ్డన్ ప్రయోగించిన తీవ్రనిర్బంధ విధానమువలన కాంగ్రెసువారు జైళ్లలో మ్రగ్గుచుండగా దేశములో 1933 సం|| అంతమునాటికి, ప్రజాభిప్రాయ ప్రకటనము చచ్చిపోయినదని చెప్పవచ్చును. ప్రభుత్వముచేయుచుండిన అక్రమములను అన్యాయములను విమర్శించుటకుగూడ ఇతర రాజకీయపక్షములకు ధైర్యము లేకపోయెను. కాంగ్రెసు - ఉద్యమము బహిరంగపద్ధతులను విడనాడి రహస్య కార్యక్రమమును ప్రారంభించెను. అక్రమసమావేశములు, సభలు, కరపత్రములు, ఇతర ప్రచారములు తీవ్రముగానే జరుగుచుండెనుగాని బహిరంగ ప్రచారములో తక్కువగా నుండెను. అందువలన విల్లింగ్డను ప్రభువు కాంగ్రెసు బలము నశించినదనియు దానిని లేవకుండ అణచి వేసితిననియు