Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెస్ ప్రభుత్వోదయము

417


“వైట్ పేపర్" అనబడు రాజ్యంగ సంస్కరణముల ప్రణాళికను ప్రకటించిరి. ఈ ప్రణాళికలో నూచింపబడిన రాజ్యాంగ విధాన మందరకును ఆశాభంగము కలిగించెను. దీనిని చర్చించి ఒక నివేదికను తయారుచేయుటకు పార్లమెంటువారొక జాయంటు పార్లమెంటరీకమిటీని నియమించిరి. దానికి లి౯ లిత్గో ప్రభువు అధ్యక్షుడు. ఈ కమిటీవారు మరల భారతీయ ప్రముఖుల కొందర నాహ్వానించి విచారించి రాజ్యాంగ సంస్కరణములను గూర్చి చర్చలుజేసి వైట్ పేపరు నింకను వడపోసి అధికారములు తగ్గించి తుదకొక నివేదికను ప్రకటించిరి. దానిప్రకార మొక చిత్తుచట్టము తయారు చేయబడి పార్లమెంటులో ప్రవేశ పెట్టబడగా నది 1935 డిశంబరులో నేటి నూతన ఇండియా రాజ్యాంగముగా చేయబడినది.

ఎనిమిదవ ప్రకరణము

కాంగ్రెస్ ప్రభుత్వోదయము

I

ఏబది యేండ్లనుండి భారతదేశ దారిద్ర్యవిమోచనము కొఱకును స్వాతంత్ర్యముకొరకును పాటుపడుచు బ్రిటిషుప్రభుత్వముతో ధైర్యముగ పోరాడి బాధలందిన జాతీయరాజకీయసంస్థ కాంగ్రెసు మహాసభ - సంస్థ యొక్కటే. తక్కిన రాజకీయపక్షములు కేవలము బ్రిటిషుప్రభుత్వముతో మంచిచేసికొని వారి నాశ్రయించి బ్రతుకునట్టివో లేదా కేవలము మతాభిమానమును కులాభిమానమును పురస్కరించుకొని స్వార్ధము నపే