Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీసత్యాగ్రహము - ఇర్విన్‌సంధి

405


చర్చింపబడిన సమస్యలలో నా సభవారి ఆలోచనలయందు అధిక సంఖ్యాకులసమ్మతినిబడసిన విషయములు శాసనము చేయగలందులకు పార్లమెంటువారికి నివేదింపబడును.” అనియు రాజప్రతినిధి ప్రకటించెను.

III

పూర్ణస్వరాజ్య ప్రకటన; ఉప్పు - సత్యాగ్రహము

వైస్రాయిచేసిన ప్రకటనలు తృప్తికరముగా లేకపోయెను. మఱియు, మొదటినుండియు భారతదేశీయుల స్వరాజ్యాందోళనముపట్ల సానుభూతి గలిగియుండిన లేబరుపక్షమువారు ఇంగ్లాండులో ప్రభుత్వము వహించినందున వారు వెంటనే భారతదేశమునకు "డొమినియను స్టేటసు" నొసగకపోవరని ఆశపడినవా రందరకును ఇది ఆశాభంగము కలిగించెను. డొమినియనుస్టేటసు ఒసగబడునను వాగ్దానములేదు సరికదా సైమను కమిటీవారి విచారణ యనునది బాధ్యతాయుత స్వపరిపాలన రాజ్యాంగప్రణాళికను తయారుచేయుటకే యని యైనను ప్రకటింపబడకపోవుటవలన భారతీయులకు పూర్తిగా ఆశాభంగము కలిగెను. కాంగ్రెసువారు నిర్ణయించిన సంవత్సరము గడువు డిశంబరుతో పూర్తియగును. అంతట పూర్ణస్వరాజ్య ప్రకటన జేయవలసి యుండెను. ఈ లోపుగా ఏదైన సమాధానము కుదిర్చిన బాగుండునని కొందరు ప్రయత్నించి చూచిరికాని లాభము లేకపోయెను. నాడు కేంద్రశాసనసభలో కాంగ్రెసు ప్రముఖులుగా నుండిన నెహ్రూ ప్రభృతులను ఇర్వి౯ ప్రభువు మర్యాదచేయుటతప్ప వారి కెట్టివాగ్దానమును