పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

404

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఇట్టి లాటీచార్జీలలో జవహర్లాలుగారికి దెబ్బలు తగులుటయు, లాలాలజపతిరాయిగారికి తీవ్రమైన దెబ్బలుతగిలి మంచముపట్టి చనిపోవుటయు అందరెఱిగినదే. దేశములో నీ సైమనుకమిటీపట్ల తీవ్రవిరోధాభిప్రాయము కలుగగా రాజప్రతినిధియగు ఇర్విన్ ప్రభువు ఇంగ్లాండుకు వెళ్ళి దేశములోని ప్రజాభిప్రాయమును గూర్చి తెల్పి దేశములో కొంత శాంతి కలిగించి కొందరు రాజకీయనాయకులనైనను సంతృప్తిపరుపవలెనన్నచో బ్రిటిషువారి ఉద్దేశములనుగూర్చిన అపోహలను పోగొట్టుట అవసరమని చెప్పి వారి సమ్మతితో 1929 అక్టోబరు 31వ తేదీన నొక ప్రకటనగావించి దానిలో "1917 వ సంవత్సరమున చేయబడిన ప్రకటననుబట్టి భరతఖండ రాజ్యాంగాభివృద్ధియొక్క సహజపరిణామము అధినివేశరాజ్యాంగ పద్దతియేయని బ్రిటీషు సామ్రాజ్యప్రభుత్వము వారి యభిప్రాయము” అని ప్రకటించెను. “ ఈ ఉద్దేశము పరిపూర్ణముగ నెరవేరుటకు భరత ఖండములోని సంస్థానములకుగూడ రాజ్యాంగమున స్థానమొసగి ఒక విధమగు అఖిలభారత - ఐక్యతను కోరువారి యాశకు భంగము లేకుండా ప్రస్తుతపు రాజ్యాంగవిధానమునందలి వ్యవహారములు జరుగవలయుననియు, ఇందుకొఱకు సైమను సంఘమువారు రాజ్యాంగ సంస్కరణములను గూర్చిన తమ నివేదికను ప్రకటించిన పిదప పైన చెప్పబడిన సంగతులు చర్చించి యాలోచించుటకును బ్రిటిషు - భారత రాజ్యాంగ సమస్యయు, అఖిలభారత రాజ్యాంగ సమస్యయు చర్చించుటకు బ్రిటీషురాజ్యమునందలి ప్రతినిధులుసు సంస్థాన రాజ్యమునందలి ప్రతినిధులును రౌండుటేబిలుసభ కాహ్వానింపబడుదురనియు ఈ మార్గమున