పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

406

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


చేయలేకపోయెను. అంతట 1929 వ డిశంబరు 31 వ తేదీ రాత్రి, కాంగ్రెసు మహాసభ బ్రిటిషువారితో సంబంధము లేకుండా పూర్ణస్వరాజ్యము లేక సంపూర్ణస్వాతంత్ర్యము సంపాదింపవలెనని తీర్మానమునుచేసెను. దానిని సంపాదించుటకు అహింసాత్మక సాత్విక నిరోధముతోడి సత్యాగ్రహమే సాధనమని కాంగ్రెసు నిర్ణయించి అందుకు వలసిన సన్నాహములను చేసి శాంతిసమరము నడుపుటకు గాంధీమహాత్మునికి సర్వాధికార మిచ్చెను.

1930 జనేవరు 26 వ తేదీన ప్రథమస్వాతంత్ర్య దినోత్సవము దేశములో నెల్లయెడలను జయప్రదముగా జరుపబడెను. భారతదేశదారిద్ర్యమునకును దాస్యమునకు బ్రిటిషుప్రభుత్వమే కారణమని తీర్మానింపబడి దానినుండి విడిపోయి పూర్ణస్వాతంత్ర్యమును స్థాపించుటకు త్రికరణశుద్ధిగా ప్రయత్నింప గలందులకు ప్రతిజ్ఞచేయు పూర్ణస్వాతంత్ర్య ప్రమాణము సభాముఖమున దేశ మెల్లయెడలను చేయబడెను.

అంతట గాంధీమహాత్ముడు, భారత దేశప్రజలకు నిజమైన రాజకీయ - హక్కులొసగదలచినచో దేశ దారిద్ర్యము మాన్పుటకు కొన్ని సంస్కరణములనైన ముందుగా చేయవలసినదనియు అవి చెల్లించనిచో బ్రిటిషువారిని విశ్వసింపజాలమనియు భారతదేశదారిద్ర్యవిమోచన కొరకును పూర్ణస్వాతంత్ర్యము స్థాపించుటకొరకును తాను ఉప్పుసత్యాగ్రహమును ప్రారంభింప దలచితిననియు రాజప్రతినిధికి మహాత్ముడు ముందుగా నొక లేఖను వ్రాసెను. అందులో మహాత్ముడుకోరిన సంస్కరణ