Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖూనీబాగ్

385


నాడేగాని దాని అవసరమునైన విచారించి తెలుసుకొనలేదు. ఈసైనిక పరిపాలనలో అత్యాచారములు జరుగకుండా ఎట్టి జాగ్రత్తలను తీసికొనలేదు. శాంతిభద్రతల పేరున జరిగిన ఘోరాన్యాయములను గూర్చి కాంగ్రెసు విచారణసంఘము వారును హార్నిమనుగారును నిష్పక్షపాతముగా వర్ణించియున్నారు. గాని ప్రభుత్వమువా రేర్పచిన హంటరుకమిటీవా రానాటి యన్యాయములకు వెల్లవేసి కప్పిపుచ్చినారు.

పంజాబులోజరిగిన ప్రతివిషయమును గూర్చియు జాగ్రత్తగా విచారించి తెలిసికొంటి ననియు ఇది చాలా సిగ్గుచేటుగను సమర్థింప వీలులేనిదిగను, క్షమింప వీలు లేనట్టిదిగ నున్నదని సి. యఫ్. ఆండ్రూస్ గారు చెప్పియున్నారు. సర్ శంకరు నాయరుగా రీయక్రమములను జూచి తమ లామెంబరు పదవికి రాజీనామా నిచ్చిరి. రవీంధ్రనాధఠాకూరుగా రీయన్యాయములకు తమ దుఃఖమును తెలిపి అసమ్మతి సూచకముగా తమ సర్ బిరుదమును త్యజించిరి.

మార్షల్ లా అమలులోనున్న రోజులలో భారతీయ స్త్రీపురుషులు అవమానింపబడి హింసింపబడిరి. ఒకవీధిలో పోవు వారెల్లరును పురుగులవలె నేలపైన ప్రాకిపోవలెనని యాజ్ఞాపింపబడిరి. అట్లు పోవనివారిని చావగొట్టిరి. ఎంతటి మర్యాదస్థులనైనను బహిరంగముగా కొరడాలతో గొట్టుట, సలాములు చేయుడని నిర్బంధించుట, సాష్టాంగప్రణామము చేయమని నిర్బంధించుట, వస్త్రవిహీనులుగజేసి అగౌరవించుట, తన్నుట, సర్వసామాన్యముగా జరిగినది. ఇద్దరు నేటివులు కలసి