Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

384

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


దుగా 'వార్నింగు' నైన నివ్వక తుపాకులతో కాల్పించి చచ్చినవారిని, గాయపడిన వారిని అచ్చటనే వదలివెళ్లెను. వారి కెట్టి సహాయమును చేయలేదు. ప్రభుత్వలెక్క ప్రకారమే 400 మంది చచ్చిరి. రెండు వేలమంది వరకును గాయపడిరి. అప్పటి కింకను సైనిక శాసనము (మార్షల్ లా) ప్రయోగింపబడలేదు. కాని సాక్షాత్తుగా మార్షల్ లా అమలు జరుపబడుచునే యుండెనని డయ్యరు సాక్ష్యమిచ్చినాడు. 13 వ తేదీన ఎట్టి సభలు జరుపరాదని తాను నిషేధించుటను గూర్చి ముఖ్యమైన అన్నిచోట్లను సాటించితి నన్నాడు. కాని అది అబద్దమని తేలినది. చాలాచోట్ల యీ ని షేధము ప్రకటింపబడనే లేదు. సభలోని వారిని తొలగిపొమ్మని తాను చెప్పలేదని డయ్యరు అంగీకరించినాడు. పైనచెప్పబడిన అక్రమముల వలన జలియన్ వాలాబాగ్‌కు “ఖూనీ బాగ్" అని పేరు వచ్చినదని మోతీలాల్ నెహ్రూగారు అసెంబ్లీలోనే చెప్పినారు.

III

మార్షల్ లా

అమృతసరములోని ఘోరకృత్యముల తరువాత లాహోరు, గుజ్రాన్‌వాలా, కాన్పూరులలో గూడ దౌర్జన్యములు జరిగెను. ఆంతట పంజాబులో మార్షల్ లా సైనికశాసనము ప్రకటింప బడెను. డయ్యరుసేనానికి మద్దత్తు చేయుటకు, మార్షలులా అవసరమని ఆనాటి పంజాబు గవర్నరు మైకేల్ ఒడ్వయరు చెప్పిన మాటలను నమ్మి వైస్రాయి షెమ్సుఫర్డు సైనికశాసనమును ప్రయోగించి