Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

350

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


భాషలోనికిని చాలకాలము క్రిందటనే అనువదింపబడెను. భారతదేశముపై ననేక పాశ్చాత్యవిద్వాంసుల కభిమానము కలిగెను. వారిరచనల ద్వారా భారతదేశ విజ్ఞానవికాసము. క్రమక్రమముగా వృద్ధిగాంచి జాతీయచైతన్యము కలిగించెను,

ప్రపంచములోని వివిధమతములయొక్క మూలసూత్రములను పరిశోధించి సర్వమానవ సౌభ్రాతృత్వము స్థాపించు నుద్దేశముతో రష్యాదేశపుస్త్రీయగు బ్లావెట్‌స్కీ గారును అమెరికా దేశీయుడగు కర్నల్ ఆల్కాటుగారును 1875 లో అమెరికాలో థియసాఫికల్ సొసైటీ అనుపేరుతో నొక దివ్యజ్ఞానసమాజమును స్థాపించిరి. వీరు భారతదేశ విజ్ఞానమును గూర్చి తమ గ్రంథములందు పత్రికలందు వ్రాయుచుండిరి. ఆకాలమున నాంగ్లవిద్యాధికులగు భారతీయు లనేకు లీ గ్రంథములను పత్రికలను జదువుచు నీ సమాజమున సభ్యులైరి. అట్టివారిలో సర్. టి. మాధవరావు, తల్లాప్రగడ సుబ్బారావుగార్లు మున్నగు ప్రముఖు లుండిరి. ఈ సుబ్బారావుగారు చాలా దూరదృష్టితో దివ్యజ్ఞాన సమాజముయొక్క స్థాపకులను మద్రాసు కాహ్వానించి వారి ప్రథానకార్యస్థానమును అడయారులో స్థాపించుటకు పోత్సహించిరి. ఇది భారతదేశమునకు మహోపకారమయ్యెను. ఆసమాజమున ననేకులు విద్యాధికులు, రాజ్యతంత్రజ్ఞులు, సంఘసంస్కర్తలు సభ్యులై భారత దేశోద్ధరణకు బద్దకంకణులై పనిచేయసాగిరి. నాడు దివ్యజ్ఞానసమాజమున సభ్యులైన వారిలో ఏ. ఓ. హ్యూముగారును ఏ. పి. సిన్నెటుగారును ముఖ్యముగా పేర్కొన