పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/373

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
జాతీయ చైతన్యము
349
 


ఉద్యోగులుగూడ దీనికి సహాయముచేయుట తటస్థించెను. హ్యూముగారికి స్నేహితుడగు బ్రైట్‌గారు ఇంగ్లాండులో నాయన చాలపనిచేసిరి. భారతదేశపక్షమున నింగ్లాండులో పార్లమెంటులో పనిచేయుట కచ్చట పార్లమెంటు సభ్యులను గొందరిని ఒప్పించి ఒక పార్లిమెంటరీ ఉపసంఘమును స్థాపించిరి. భారతదేశమున వివిధప్రాంతములందలి రాజకీయ సంస్థలయొక్క ప్రతినిధులను, కొందరు రాజకీయ ప్రముఖులను, 1885 డిసెంబరు నెలలో పూనాలో నొక మహాసభయందు సమావేశము కావలసినదని హ్యూముగారు మార్చినెలలోనే ఆహ్వానము లంపిరి. ఈ మహాసభకు పూనా నగరమున నొక ఆహ్వానసంఘ మేర్పరచిరి. అయితే పూనాలో కలరా వచ్చుటవలన సభను బొంబాయిలో జరుపవలసివచ్చెను. అచ్చట నాహ్వానసంఘమునకు కాశీనాధత్ర్యంబకనాధ తెలాంగుగారు అధ్యక్షులైరి. ఆ ప్రకారము డిశెంబరు 28 వ తేదీన బొంబాయిలో జరిగిన జాతీయ ప్రతినిధుల సభయే నేటి కాంగ్రెస్ మహాసభయొక్క ప్రథమ సమావేశము. ఇట్లు కాంగ్రెస్ మహాసభకు హ్యూముగారే మూల పురుషుడైనాడు.

IV

భారతదేశ భాగ్యభోగ్యములు బ్రిటిష్ రాజ్య తంత్రజ్ఞుల నాకర్షించినట్లే ఈదేశముయొక్క పూర్వనాగరకత, ఆర్య విజ్ఞానము, మత ధర్మములు పాశ్చాత్య పండితుల నాకర్షించెను. అనేక సంస్కృతగ్రంథములు ఇంగ్లీషులోనికిని జర్మనీ