బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
13
ఖానాలోనికి తెరచియుండు కిటికీదగ్గరకు తరచుగావచ్చి నిలుచుండును. అర్జీల నాయన స్వయముగా విచారించి తీర్మానించును.
షాజహాను ఔరంగజేబులు బుధవారమునాడు సామాన్యదర్బారు మానివేసి సభలో పరివేష్టించి న్యాయవిచారణ జేయుచుండిరి. దర్శనగవాక్షమునుండి తిన్నగా దివానీఖాస్ మందిరమునకు ఉదయము 8 గంటలకు చక్రవర్తి వచ్చును. న్యాయోద్యోగులు, ఖాజీలు, “అదళ్ళు" అనున్యాయాధిపతులు, మప్టీలు, ఉలేమాలు, న్యాయశాస్త్రజ్ఞులు “దరోగా-ఈ-అదాలత్" అనబడు కోర్టుల పెత్తనదారుడు, కొత్వాలు అనబడు పట్టణపోలీసు అధికారియు తప్ప సామాన్యసభాసదుల నామందిరమునకు రానీయరు. న్యాయాధికారి ఫిర్యాదీల నొక్కొకరినే చక్రవర్తి కెఱుక పరుపగా నాయన శాంతచిత్తుడై వారి మనవులను విచారించి శాస్త్రధర్మమును తెలిసికొని తీర్పుచెప్పును. (J. N. Sarkar-Mughal Administration quoted by Wahed Hussain 38–40). జహంగీరు చక్రవర్తియొక్క కొలువుకూటమున ముఖ్యముగా నెన్నదగినది, మనవిదారులు తమ అర్జీలను నిర్భయముగా చక్రవర్తికి అందచేయుటకొరకు ఆగ్రా కోటయొక్క షా బురుజుకు కట్టబడిన బంగారు గొలుసు గంటలు. దీని రెండవకొన నదీతీరమున నొకశిలాస్తంభముకు గట్టబడియుండును. మనవి దారులు తమ అర్జీల నాగొలుసుకు గట్టినచో సేవకులయొక్క ఆటంకము లేకుండా ఆ గొలుసు పై కిలాగి చక్రవర్తి స్వయముగా చిత్తగించుచుండును. నిష్పక్ష