12
భారత దేశమున
మున నుండెను. ఎప్పటికప్పుడు సొమ్ము ఇరసాలు చేయుచుండవలెను. ప్రతినెల ప్రజల స్థితిగతులను విశేషములను ధరలనుగూర్చి ఒక నివేదిక పంపవలెను. అక్బరుకాలమున గ్రామములయొక్క పరిపాలన న్యాయవిచారణ పూర్వము వలెనే పంచాయితీలే జరుపుచుండెను. ప్రతిపట్టణమున నొక "కొత్వాలు" అనబడు మేజస్ట్రీ టుండెను. ఇతడు పోలీసు అధికారిగానుండి పరిపాలనావ్యవహారములన్నియు జరిగించును. పట్టణములకు బయట దేశములో క్రమమగు పోలీసు ఫౌజు లేదుకాని గ్రామములకు వంశపారంపర్యముగా కావలివా రుండిరి. ఈ మేజస్ట్రీటులేగాక న్యాయవిచారణకొరకు “మిర్ అదల్" అనబడు న్యాయాధిపతియుండెను. ఇతడు న్యాయవిచారణలో తీర్పుచెప్పు అధికారి. మహమ్మదీయ ధర్మాధికారియగు ఖాజీకూడ ఒక న్యాయాధికారియేగాని ఇతడు ధర్మశాస్త్రము జెప్పి వ్యాజ్యము నడిపించును. " నేనే అన్యాయము చేసినగూడా నేను దానినిగూర్చి న్యాయవిచారణ చేసితీరెదను" అని అక్బరుచక్రవర్తి పలికియుండెను. అక్బరు చక్రవర్తి న్యాయవిచారణ చేయుట కొరకు ప్రతిదినము ఉదయము 9 గంట లైనతరువాత దౌలతుఖానా యను కొలువుకూటమున కూర్చుండి దావాలను అప్పీళ్ళను విని పరిష్కరించును. ఆసమయమున నాయన సమక్షమున కెల్లరు వెళ్ళవచ్చును. ఒక్కొక్కప్పు డీ న్యాయసభ సాయంత్రముగూడ జరుగును. మధ్యవా రెవ్వరివలన నెట్టి యాటంకము లేకుండా అర్జీలను స్వయముగా స్వీకరించుట కొర కాయన దౌలతు