పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

భారత దేశమున


పాతముగ న్యాయము ప్రసాదించుట చక్రవర్తి కంత ప్రీతి. పాజహాను చక్రవ ర్తి కేవలము తన ప్రజలను కన్నతండ్రివలెనే యాదరించి న్యాయపరిపాలన చేయుచుండెను. సాష్టాంగ దండప్రణామము చేయుట నితడు మాన్పించి ప్రతి బుధవారమును అర్జీలను స్వయముగా వినుచుండెను. (Eliot- History of India Vol VII. P. 170–3) ఔరంగజేబు చక్రవర్తి రాజ్యాధికారము సౌఖ్యముకొరకు కాదనియు ప్రజాక్షేమము కొరకే యనియు నిశ్చయించి నిష్పక్షపాతమగు న్యాయవిచారణ చేయుచుండెను. దర్శనమందిరమున శాంతవదనముతో దినమునకు రెండు మూడుసార్లు వచ్చి నిలిచి మనవుల చిత్తగించును. ప్రజలు నిర్భయముగా తమబాధ లాయనకు జెప్పుకొనుచు న్యాయము పొందుచుండిరని ఇలియట్ తన చరిత్రలో వాసినాడు. (Vol. VII. 158) “ఈచక్రవర్తి చాల తెలివైనవాడు. రాజుయొక్క యధికారము ప్రజల యభివృద్ధిపైన నాధారపడి యుండునని ఇత డెరుగును. తన ప్రభుత్వముయొక్క క్షేమము నాలోచించి యితడు ప్రజాపీడనమును సహింపక తన పరిపాలన చక్కగా జరుగుచున్నదో లేదో అని కనిపెట్టుచుండెను. వ్యవసాయమును వాణిజ్యమును ప్రోత్స హించుచుండెను. ఆయన వరిపాలనలో ప్రతిచోటను ఆస్తికి రక్షణయుండెను. పూర్వపరిపాలనమునందు కన్న గూడా న్యాయవిచారణ ప్రజలకు సులభసాధ్యము గావించెను. దావాలు త్వరలో పరిష్కరించునట్లు చేసెను. ఈయన కాలమున ఉరిశిక్షయే గానరాదు. తనకు వ్యతిరేకముగా తన