Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాతీయ చైతన్యము

339


నేటి హైకోర్టులను స్థాపించుచట్టము చేయబడి మొదటి హైకోర్టు కలకత్తాలో స్థాపింపబడినది.

ఈ విప్లవానంతరమే బ్రిటిషువా రీ దేశపు ప్రభుత్వోద్యోగములనుగూర్చిన నిబంధనలను క్రమబద్దముగజేసిరి. ఇండియన్ సివిల్ సర్వీసు ఉద్యోగములు కేవలము ఇంగ్లాండులో నియమింపబడు ఐ.సి.యస్ వర్గమువారికే ప్రత్యేకించి, తక్కిన ఉద్యోగముల నందరికిని అందుబాటుజేసిరి. ఈ ఐ. సి. యస్ . ఉద్యోగుల జీతములు, అలవెన్సులు, పింఛనలును అత్యధికముగా పెంచబడెను. విప్లవమునకు ముందుగానే విద్యావిధాన సంస్కరణమును గూర్చి చేయబడిన సూచనలనుబట్టి విశ్వవిద్యాలయములు స్థాపింపబడెను. ఈ సమయముననే క్రొత్త శాసనసభలను నిర్మించుచు 1861 లో నొక చట్టమును చేయబడెను.

ఆనాటికే భారతదేశ ప్రజలస్వాతంత్ర్యముల నణచివేయు శాసనము లనేకము లమలులోనుండెను. ఎట్టి విచారణ లేకయే రాజద్రోహము గావించెనను అనుమానమున్నచో పట్టుకొని ప్రవాసమంపుటకు 1818లో వంగరాష్ట్రపు మూడవ రెగ్యులేష౯; మద్రాసురాష్ట్రపు రెండవ రెగ్యులేషను; బొంబాయిరాష్ట్రపు ఇంకొక రెగ్యులేషను;ల తోపాటు దేశములోని రాజకీయపరిజ్ఞానము హెచ్చుటచూచి 1850 లో మరికొన్ని నిర్బంధకరములైన శాసనములు చేయబడినవి. విప్లవానంతరము చేయబడిన ప్రజాస్వాతంత్ర్య నిరోధకశాసనములకు మితియేలేదు. అతి నిపుణముగా శిక్షాస్మృతి సవరింపబడి 1860 నాటికి పీనలు కోడ్డుగా శాసింపబడినది. 1861లో క్రిమినలు న్యాయవిచారణ