Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

338

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


యములపైన బద్దత చేయబడినది. ఇట్లు కంపెనీవారి పరిపాలన పోవునప్పటికి 112 కోట్ల రూపాయిల ఋణము మన దేశముపైనబడి దానిపైన వడ్డీ మనము చెల్లించవలసివచ్చితిమి. కంపెనీవారి ఆస్తి కొన్నందుకైన ఖర్చు, తరువాత గవర్నరుజనరలు చేసిన యుద్దముల ఖర్చులు, అత్యధికవ్యయముతో నిర్మింపబడిన రైలుదారిఖర్చులు, కలిసి ఈ ఋణభారము క్రమక్రమముగా వృద్దియై సాలియానా 60 కోట్ల రూపాయల చొప్పున వడ్డీలు చెల్లించగా గూడా నేటికి రూ 1200 కోట్లు మిగిలినది.

సిపాయిల విప్లవము తరువాతనే భారతదేశ ప్రజలు భరించవలసిన పన్ను లధికము చేయబడి అవి నానాటికి పెరిగినవి. సిపాయివిప్లవమువలన దేశాదాయములో లోటు వచ్చినదని తాత్కాలికముగా ఆదాయపుపన్ను అనబడు క్రొత్తపన్ను విధించుట మొదలిడిరి. ఆ పన్ను నాటికి నేటికీ తీసివేయబడలేదు. దేశప్రజలకు విద్యకు వైద్యమునకు ఇతర సౌకర్యములకు సొమ్ము లేదనిరి. దేశక్షేమముకొరకని సైనికవ్యయము మాత్రము అత్యధికము జేసిరి. జాగ్రత్త కొరకని ఆంగ్లేయ సైనికుల సంఖ్యను వృద్ధిజేసిరి.

సిపాయి విప్లవానంతరము బ్రిటిషువారు సివిల్ క్రిమినల్ వ్యవహార ధర్మవిధులను శిక్షాస్మృతిని క్రోడీకరించిరి. ఇట్లు 1860 లో పీనల్‌కోడ్ 1861 లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్డును క్రోడీకరింపబడినవి. శివిల్ ప్రొసీజర్‌కూడా నిర్మింపబడినది. సాక్ష్యస్మృతి విధులుకూడా సంపుటీకరింపబడినవి. 1861 లో ప్రాతన్యాయస్థానములకు బదులు ఆంగ్లరాణి ఫర్మానాక్రింద