పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

340

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


వ్యవహారధర్మములు క్రిమినలు ప్రొసీజరుగా నిర్మింపబడినవి. ఈలోపుగానే 1857 లో ప్రెస్‌చట్టము, స్టేటునేరముల చట్టము, 1858లో స్టేటుప్రిజనర్ల చట్టము, 1858లో ప్రభుత్వముపైన తిరుగబడు పితూరీదారుల ఆస్తినిలాగుకొనుచట్టము, 1860లో ఆయుధ నిషేధచట్టము, 1861 లో శిక్షార్థపు, ప్యూనిటివ్ (పోలీసు) చట్టము శాసింపబడినవి. 1867లో ప్రెస్సులు, బుక్కుల, రిజిస్ట్రేషనుచట్టము, 1878లో దేశభాషాపత్రికలచట్టము, 1876లో నాటక ప్రదర్శనముల చట్టము, ప్రజాభిప్రాయము నణచు కొత్త శృంఖలములుగా జేయబడెను. ఈ దేశభాషాపత్రికల శాసనము ప్రభుత్వ విమర్శలజేయు ప్రతికాధిపతులపైన ముద్రాలయముపైన ప్రయోగింపబడి కొందరు శిక్షింపబడిరి. ఇది బహిరంగ ప్రజాభిప్రాయమునకు ఆటంకము కలిగించి రహస్య విప్లవమార్గములకు ప్రోత్సాహ మొసగెను.

II

భారతదేశమున ఆంగ్లేయవిద్య యభివృద్ధిగాంచుటవలన 1870 నాటినుండి దేశములో రాజకీయపరిజ్ఞానముకూడ క్రమక్రమముగా అభివృద్ధి గాంచుచుండెను. 1875 నాటికి భారతీయులు నడుపు ఆంగ్లేయపత్రికలు గాక దేశభాషలందు కూడ 475 పత్రికలు వెలసి ప్రజాభిప్రాయమును వెల్లడించుచుండెను. 1878 లో హిందూ పత్రిక ఒక వారపత్రికగా జి. సుబ్రహ్మణ్య అయ్యర్ , న్యాపతి సుబ్బారావు పంతులుగార్ల వల్ల స్థాపింపబడెను. 1884 లో నిది వారమునకు మూడుసార్లు ప్రచురింప బడుచు 1889 లో దినపత్రికయై జాతీయ ప్రజాభి