300
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
కొనెను. మతాభిమానము త్వరలోనే దేశాభిమానముగా పరివర్తన జెంది ఈతనిని దేశభక్తునిగా జేసెను.
స్వమతరక్షణకొరకు పూనుకొనగానే ఇతడు ముందుగా ప్రజాభిప్రాయమును కలిగించుటకు 'చెన్నపట్టణ స్వదేశసంఘ' మను పేరున ఒక ప్రజాసంఘమును స్థాపించి అప్పుడప్పుడు సభలుచేయించి తీర్మానములనుగావించి మహజరులను తయారు చేయించి అధికారులకు పంపుట ప్రారంభించెను. అందుకు కావలసిన వ్యయమునెల్ల తానే భరించెను. నాడు దేశమున ప్రచారములోనుండిన ఆంగ్లేయపత్రికలెల్ల హిందూమతమును దూషించుచు క్రైస్తవమతమునుభూషించుచు క్రైస్తవమతాచార్యుల యొక్కయు ప్రభుత్వముయొక్కయు చర్యలనెల్ల సమర్ధించుచు భారతదేశప్రజల కెంతోనష్టకరముగా ప్రచారముచేయు చుండెను. ఈవ్రాతలనెల్ల ఖండించి సత్యప్రచారము గావించుటకును, నిజమైన ప్రజాభిప్రాయమును వెల్లడించుటకును స్వతంత్రమగు ఆంగ్లపత్రిక నొకదానిని స్థాపించుట అవసరమయ్యెను. అట్టిది నడుపుటకు ఎంతోధనము కావలసియుండెను. నేటివలె నాడు ఇంగ్లీషు బాగుగవచ్చిన భారతీయులు హెచ్చుమందిలేరు. ఇంగ్లీషువచ్చిన కొద్దిమందికూడా ప్రభుత్వోద్యోగముల నాసించి వారినాశ్రయించువారేగాని స్వతంత్ర అభిప్రాయములను కలిగి పత్రికను నడుపగల శక్తిగాని ధైర్యముగాని కలవారు కారు అందువలన అట్టి పత్రిక కాంగ్లేయసంపాదకునే నియమింప వలసివచ్చెను. పెద్దజీతమిచ్చినగాని ఆంగ్లేయులు రారు. ఇందుకెల్ల సంసిద్ధుడై, లక్ష్మీనర్సుగారు “క్రెసెంటు" అనుపేర నొక