Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశోద్ధరణ ప్రయత్నములు

299


యుండెను. అందుకొర కెంతో సొమ్ము ఖర్చు చేయవలసి ఈ కార్యము సాధించుటకెంతో ధైర్యము కావలసియుండెను. ఈ శక్తియెల్ల ఈ ఆంధ్ర వణిక్చిఖామణికి కలుగుట పరమేశ్యరుని కృపగాక మరి యేమనవచ్చును ? ఇందు దిగినచో ప్రభుత్వముతోను ఆంగ్ల వర్తకులతోను విరోధములువచ్చి తీరుననియు తన వర్తకమునకు నష్టము వచ్చుననియు సర్వనాశన మగుటకూడ సంభవించవచ్చుననియు లక్ష్మీనర్సుగారు గ్రహింపకపోలేదు. అందు కెల్ల సిద్ధపడియే ఇతడు ప్రజాసేవచేసి ధన్యుడుకాదలచెను. ఈతని జీవితచరిత్ర గాంధి మహాత్ముని జీవితమువలెనే నిష్కళంకమై దేశభక్తి పూరితమై, ధన్యతగాంచి దేశచరిత్రలో సువర్ణాక్షరములలో లిఖయింపదగినది.[1] ఇట్టి దేశభక్తుడు ఆంధ్రుడే యగుట మన అదృష్టమని చెప్పకతప్పదు.

లక్ష్మీనర్సుగారు. విద్యాధికుడు కాడు. ఇతని కింగ్లీషు రాదు. తన వ్యాపారమునకు గావలసిన వ్రాతకోతలు లెక్కలు మాత్రము వచ్చును. పైన చెప్పబడిన దేశపరిస్థితులను చూడగా నీతని హృదయము కరగి స్వధర్మమును, స్వమతమును సంరక్షింపవలెనను దీక్షనువహించి అందుకు కావలసిన కార్యములెల్ల నిర్వహించుచు అందుకు తన యావచ్ఛక్తిని వినియోగించి తన సర్వస్వమును ధారవోయుటకు నిశ్చయించు

  1. గాజుల లక్ష్మినర్సుసెట్టిగారి జీవితమునకు శ్రీచిలకమర్తి లక్ష్మీనరసింహకవిగారి మహాపురుషుల జీవితములు చూడుడు.