Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశోద్ధరణ ప్రయత్నములు

301


ఆంగ్లపత్రికను స్థాపించి సైనికోద్యోగముచేసిన విద్యాధికుడగు నొకఆంగ్లేయునకు పెద్దజీతమిచ్చి దానికి సంపాదకునిగా నియమించెను. ఈనంపాదకు డతి ధైర్యముతో పనిచేయుచు ప్రభుత్వమును మతాచార్యులును చేయు దురాగతములను తీవ్రముగావిమర్శింపసాగెను. ఆనాటి ఆంగ్లపత్రికలకెల్ల కంపెనీ దొరతనమువారు ప్రకటనలనిచ్చియు ఇతరవిధములుగను ప్రోత్సహించుచుండిరి. గాని యీ క్రెసెంటు పత్రికను తమకు విరోధిగా పరిగణించి దీనికెట్టి సహాయమును చేయరైరి. పైగా లక్ష్మీనర్సుగారిని అనుమానముతో చూడసాగిరి.

ఇంతలో తీవ్రమైన రాజకీయాందోళన ప్రారంభించుట యవసరమైస సందర్భము కలిగెను. హిందూధర్మశాస్త్రప్రకారము మతాంతరులైనవారికి జాయింటు కుటుంబాస్తిలో హక్కులు పోవును. అందువలన క్రైస్తవమతము నవలంబించుటకు ప్రజలు సంశయించుట చూచి క్రైస్తవమతాచార్యులు ప్రభుత్వముతో కుట్రచేసి ఈ యాటంకమును తొలగించి ప్రజలను ప్రోత్సహించుటకు ఒక చట్టముచేయ ప్రయత్నించిరి. దానివలన క్రైస్తవమతము పుచ్చుకొన్నవారికి సైతము ఆస్తి హక్కులు నిలిచి యుండగలవు. ఇక నిర్భయముగ బలవంతముగ కూడ తమ మతములో కలుపుకొనవచ్చును. ఇది చూచి లక్ష్మినర్సుగారు వెంటనే తన పత్రికాముఖమున ఈ కుతంత్రమును వెల్లడించి విమర్శించుటయే గాక ప్రజలలో దీనిని గూర్చి ప్రచారముజేసి ఈ అన్యాయపు చట్టము చేయకుండ నిరోధించుట కొక అసమ్మతి సభను 1845 ఏప్రియలు 9 వ