పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


స్వాతంత్ర్యములు సంఘసంస్కారము నీయనకు పరమధర్మములుగ నుండెను. రామమోహనరాయలు, విద్యాధికుడును ధనవంతుడును రవీంద్రునికి పితామహుడును అగు ద్వారకనాధ టాగూరుగారితోను ఇంకను డేవిడు హెర్ దొర మున్నగువారితోను కలసి 1817 లో కలకత్తాలో హిందూ కాలేజీని స్థాపించి విద్యాభివృద్ధికి మార్గము జూపినాడు. ఆనాడు జీవచ్చవమువలె నున్న మొగలాయి చక్రవర్తి, ఏలుటకు రాజ్యమును అనుభవించుటకు ఐశ్వర్యమును లేక ఆంగ్లేయులవలని బాధలు పడుచు రామమోహనరాయలుగారికి "రాజా" అను బిరుదునిచ్చి తన పక్షమున నింగ్లాండుకుపోయి పార్లిమెంటులో పని చేయవలసిన దని కోరగా రామమోహనరాయలు 1830 నవంబరు 15 వ తేదీన మొగలాయి చక్రవర్తి రాయబారీగా నింగ్లాండుకు పోయెను. అచ్చట ఆంగ్ల రాణి పట్టాభిషేకమున నీయన గొప్ప గౌరవమునుకూడ పొందెను. పార్లమెంటు కమిటివారి ఎదుట భారతదేశరాజకీయములను గూర్చియు సంఘసంస్కారమును గూర్చియు సాక్ష్యమునిచ్చి తరువాత జరిగిన కొన్ని రాజకీయ సంస్కరణములకు మూలకారకుడయ్యెను. ఇంగ్లండులోని కవీశ్వరులు తత్వశాస్త్రజ్ఞులు విద్యాధికులు నీయన ఉపన్యాసములు విని ఈతనితో స్నేహముచేసి భారతదేశముపట్ల అభిమానము గలవారైరి. ఈ మహామహుడు 1833 సెప్టెంబరు 27 వ తేదిన ఇంగ్లాండులోనే దివంగతుడయ్యెను. ఈయన 'సంవాద కౌముది' యను పత్రికను నడుపుచుండెను. ద్వారకనాధఠాకూరుగా రీయనకు కుడిభుజమువలెనుండి పనిచేయుచుండిరి. ఠాకూరు