దేశోద్ధరణ ప్రయత్నములు
291
హెన్రీకాటనుగారు నొక ఐ.సి.ఎస్ . ఉద్యోగి. ఇట్టి పరోపకార పారీణులగు మహనీయు లెందరో మన దేశోద్ధరణకొరకు పాటుపడిరి. భారతదేశమునకు పరోపకారము చేసిన రాజప్రతినిధులలో రిప్పనుపేరు సువర్ణాక్షరములతో లిఖింపదగినది. డఫ్రిన్ ప్రభువుకూడ కాంగ్రెసు స్థాపనకాలమున చాల పాటుపడెను. వెడ్డర్ బర౯, యూలుగార్ల పేర్లు మన జాతీయ చరిత్రయందు శాశ్వతముగా స్మరింపదగినవి. భారతదేశ ప్రజలందు జాతీయ చైతన్యమును కలిగించుట కిట్టివారే మూలకారకులు.
II
బ్రిటీష్ ప్రభుత్వయుగమున భారతదేశోద్ధరణప్రయత్నము రాజారామమోహనరాయలుగారితో ప్రారంభమైనదని చెప్పవచ్చును. ఈతడు క్రీస్తుశకము 1774 లో జన్మించి సంస్కృతాంగ్లములందును, ఫారసీ వంగభాషలయందును అఖండమైన పాండిత్యమును సంపాదించి భారతదేశ మతధర్మమును క్రైస్తవ మహమ్మదీయమతధర్మములను చక్కగా గ్రహించి బహ్మసమాజస్థాపనజేసి, సహగమనమును నిర్మూలించుటకు, పసిపాపలను గంగలో పారవేయు దురాచారమును మాన్పుటకు, సంఘసంస్కారమును జేయుటకు, విజ్ఞానవికాసము కలిగించుటకు కృషిజేసి అసంఖ్యాకములగు గ్రంథములను రచియించి ఉపన్యాసముల నొసగి శ్రమపడినాడు.
అనాటి క్రైస్తవమతబోధకు లీయనను తమమతములో గలుపుకొనుటకు ప్రయత్నింపగా నీయన నిరాకరించి క్రైస్తవ ధర్మములను తీవ్రముగా విమర్శించెను. రాజకీయ మత