దేశోద్ధరణ ప్రయత్నములు
293
గారు కూడా 1841 లో ఇంగ్లాండునకు పోయి అచ్చటనే మరణించిరి.
III
భారతదేశమున 1799 మొదలు 1834 వరకును ప్రెస్ రెగ్యులేషనులు పత్రికాప్రచురణకు నిర్బంధకరములుగ నుండెను. ఆంగ్లేయులు మాత్రము కొంతమంది కొన్ని పత్రికలు నడుపుచుండిరి. కంపెనీవారి దుష్పరిపాలననుగూర్చి అనహ్యము కలిగి విమర్శించిన కొందరు ఆంగ్లేయ పత్రికాధిపతులు, పాపము, ఈనాటి హర్నిమ౯ గారివలెనే ప్రవాసముల కంపబడు చుండిరి. మొదటి ఇంగ్లీషుపత్రిక 1780 లో కలకత్తాలో స్థాపింపబడిన "హిక్కిస్ గెజెట్ .” తరువాత కొందరు ఆంగ్లేయులు, వర్తకులు, క్రైస్తవమత బోధకులు కొన్ని పత్రికలు స్థాపించిరి. అటుతరువాత కొద్దిమంది భారతీయులుకూడ ఇంగ్లీషు పత్రికలు స్థాపించిరి. 1835 నాటి కట్టివి 6 పత్రికలుండెను. ఆనాటి గవర్నరుజనరలు విలియం బెంటింకుగారు వానిపట్ల కొంచెము సానుభూతి కలిగియుండెను. గాని దేశభాషలందు అంతవరకు ప్రకటింపబడిన పత్రికలు కడుస్వల్పముగ నుండెను. ఉన్నవి కేవలము మతమునకు సంఘసంస్కారమునకు సంబంధించినవే. రామమోహనరాయలవారి "సంవాద కౌముది " వానిలో ప్రధానమైనది. 1835 లో తాత్కాలిక గవర్నరుజనరలుగ నుండిన 'మెట్ కాఫ్ ” ప్రెస్ రెగ్యులేషనులను తీసి వేయగా క్రమక్రమముగా దేశీయపత్రికలు స్థాపింపబడసాగెను.
ఆ రోజులలో భారతజాతీయ చైతన్యమునకు తోడ్పడిన