Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


వర్తక కంపెనీ డైరెక్టరులకు తమ పెట్టుబళ్ళపైన నూటికి 10 1/2 వంతుల లాభము పంచిపెట్టబడుచునే యుండెను. అందువలన 1833 సంవత్సరములో చెప్పబడినట్లు భారతదేశ సత్ప్రభుత్వమునకు ఆంగ్ల పార్లమెంటువారి హామీ యుండునను మాటలు వృధయైనవి.

ఇక నీసంగతులనుగూర్చి హెచ్చు వివరములు చెప్పవలసిన అగత్యములేదు. ఏమాత్రము న్యాయబుద్దిగాని ధర్మ చింతగాని దేశభక్తిగాని గలవారికైనను ఈకంపెనీవారికి భారతదేశపరిపాలనాధికారపు పట్టాను మరల నిచ్చుట న్యాయము కాదని తోచుటకు వలసిన సంగతులు చెప్పబడియే యున్నవి, దీనివలన నికముందు భారతదేశ పరిపాలనకు తగిన ప్రత్యేక ఏర్పాటులు చేయుట యవసరమని నిష్పక్షపాతబుద్ధి కలవారి కెల్లరకు తోచితీరును. (Rise of Christian Power-Basu)

పదునొకండవ ప్రకరణము

దేశోద్ధరణ ప్రయత్నములు

I

భారతదేశమును పరిపాలించు బ్రిటిష్ ఉద్యోగవర్గముయొక్క యజమాను లీ దేశమునకు పదివేలమైళ్ళ దూరమున నింగ్లాండులోనున్న పార్లిమెంటువారును కంపెనీవారునై యుండినందున నీ దేశపరిపాలనము చెప్పుకొనుటకును, ఆలనపాలన జరుగుటకును, తగుఅవకాశములే లేకుండెను. భారతదేశముపట్ల సానుభూతిగలిగిన ఆంగ్లేయ