పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశోద్ధరణ ప్రయత్నములు

289


ప్రముఖులెవ్వరైన దయగలిగి ఇంగ్లీషుపార్లిమెంటులో నేదైన చెప్పినకద్దు లేకపోయినలేదు. అట్లు చెప్పినప్పుడైనను పార్లిమెంటు సభ్యులు ఓపికతో వినెద రను నాస లేదు. ఇండియా వ్యవహారముల చర్చించుసమయమే చాలమందికి భోజనసమయమను నొకసామెతవలన నీ దేశముపట్ల వారి కెంతశ్రద్ధయుండెనో తెలియగలదు. వార౯హేస్టింగ్సు కాలమునాటి దుష్పరిపాలనమునుగూర్చి బర్కుమహాశయుడును అతని స్నేహితులును విమర్శించిన కాలమునుండి 1847 వరకును మరల నీదేశ వ్యవహారములనుగూర్చి పార్లి మెంటులో తలపెట్టినవారే లేరు.

1847 లో జా౯బ్రైట్ అను నొక మహానుభావుడు. పార్లమెంటు మెంబ రయ్యెను. ఇతడు భారతదేశచరిత్రను వ్యవహారములనుగూర్చి జాగ్రత్తగా చదివి, హృదయము కరిగి ఈ దేశమున జరుగుచుండిన దుష్పరిపాలనమునుగూర్చి పార్లమెంటులో వెల్లడింపసాగెను. ఈ దేశమున బ్రిటిష్ ప్రభుత్వమున ప్రజ లెన్నో బాధలు పడుచుండుట, న్యాయవిచారణ బాగుగ జరుగకుండుట, పోలీసులు ప్రజాపీడకులగుట, పన్ను లత్యధికముగానుండి రైతు లిచ్చుకోలేకుండుట, వానిని వసూలుచేయుటలో అధికారులు రైతుల నెన్నోవిధములుగా హింసించు చుండుట, ప్రజల కెట్టి సౌకర్యములును లేకుండుటనుగూర్చి యితడు పార్లమెంటులో తీవ్రముగా విమర్శింప సాగెను. క్రైస్తవమతాచార్యులు చేయుచుండిన అన్యాయముల నాయన పార్లమెంటువారికి విశదపరుపసాగిరి. స్లాగ్ గారు బాక్సుటరుగారు అను పార్లమెంటు సభ్యులును, సర్ విలియం