Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంపెనీ పరిపాలన యొక్క ఫలితములు

287

హిందూమహమ్మదీయ మతములు త్రాగుడును నిషేధించుచుండగా ప్రభుత్వమువారు కల్లు సారాయములపైన లాభములు దీయుకొరకు ప్రజలను త్రాగునట్లు నిర్బంధించు చున్నారనియు చెప్పుకొనుచున్నారు. అందువలన ప్రజాభిప్రాయమును దృష్టాంతరముగా గైకొనినను 1833 వ సంవత్సరపు ప్రభుత్వవిధానము అసంతృప్తి కరముగనే యున్నదనక తప్పదు.

భారతదేశమున కొక రాజ్యాంగమును ప్రసాదించుటకు బదులుగా 1833 సంవత్సరఫుకంపెనీ పట్టాచట్టమును పార్లమెంటు వారు శాసించియుండిరి. భారతదేశపరిపాలనమును భారతీయుల వశముచేయుటకు వీలులేదు గనుక భారతదేశ ఆదాయవ్యయములలో నేలోపమైన గలిగినచో నది మనగృహకల్లోలముగను మనకు నష్టముగను భావించుకొను ఆంగ్లేయ ప్రజాసమూహములే ఆదేశమును కనిపెట్టి రక్షింపగల నియోజకవర్గముగా నుండునని ఆనాటి పార్లమెంటులో మెకాలే మున్నగువారు పలికియుండిరి. ఆంగ్లేయ ప్రజాప్రతినిధు లీ యిరువది యేండ్లలోను ఇట్టి బాధ్యతను గలిగి ప్రవర్తించినారా ? భారతదేశ క్షేమలాభములు కనిపెట్టి యుండి రక్షింప ప్రయత్నించినారా? లేదు. భారతదేశ ఆదాయవ్యయములందు ఈ 15 సంవత్సరములలోను కల్లోలములు కలిగెను గాని ఆచిక్కులను మన ఆంగ్లేయ కంపెనీ డైరక్టర్లు తమ క్షేమమునకు సంబంధించిన వ్యవహారముగా ఎంచుకొని యుండలేదు. భారతదేశ ఆదాయములో లోటులు కలుగుచున్నను ఆంగ్లేయ