పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


లెక్కలలోచూపబడిన మొత్తములో కొంత కేవలము సైన్యమున కుపయోగించు బ్యారక్సు (బారకీచుల) నిర్మాణమునకు వ్యయము చేయబడినవి. మరియు మొత్తము ఖర్చులో నూటికి 70 వంతులు కేవలము పైతనిఖీక్రిందనే ఖర్చుచేయబడుచున్నది. ఇక ప్రజోపయుక్తములకొరకు చేయబడిన వ్యయమను నది యెంత బూటకముగనున్నదో యూహింపుడు.

దేశములో యుద్దములు, ప్రభుత్వాదాయములో లోటులు, రోడ్లు బ్రిడ్జీలు హార్బర్లు పబ్లికు వర్క్సు లేకపోవుట, యటుండనిచ్చి ప్రజ లీ యిరువదేండ్లలో నావంతయైన అభివృద్ధిగాంచినచో కంపెనీపరిపాలన ధన్యమైనదని చెప్పవచ్చును.. గాని యిది శూన్యము. వంగరాష్ట్రమున జమీందారీ పద్ధతిలోని రైతులు క్రుంగిపోవుచుండగా మద్రాసులో రైత్వారి పద్ధతిలోను, బొంబాయిలో “కంపోజిట్" పద్దతిలోను గూడా రైతు దుస్థితిలోనే యున్నాడు. బంగాళములో నాల్గుకోట్ల ప్రజలు, మద్రాసులో రెండుకోట్ల ఇరువదిలక్షల ప్రజలు, బొంబాయిలో కోటిమంది ప్రజలు ఈప్రభుత్వమునపొందు సౌఖ్యము గానరాదు. వ్యవసాయము, పాడిపంటలు, క్షీణించుటయేగాక జనుల యొక్క పూర్వసంపద మటుమాయమైనది. నేటివు సంపన్న గృహస్థులు నేడు గానరారు. ప్రస్తుతపు పరిస్థితులే యింకను అమలుజరిగినచో నింకొకటి రెండు తరములలో రైతులు సామాన్య ప్రజలుగానుండు స్థితికూడపోయి కేవలము దరిద్రులగు దేశద్రిమ్మరులై పోవుదురు. 1833 వ సం|| చట్టము స్థాపించిన న్యాయవిచారణ విధానము పనికిమాలినది. ధర్మ