Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంపెనీ పరిపాలన యొక్క ఫలితములు

283


శాస్త్రసంస్కరణమనుపేరున చాలసొమ్మును వెచ్చించిరి. కోర్టు విచారణలు బాహ్యాడంబరములు ఆచార వ్యవహార విధులు లెక్కకు మీరినన్ని నెలకొల్పబడినవి. న్యాయము పొందగోరి వచ్చిన బాధితులు న్యాయవాదులకేగాక ప్రభుత్వమునకు గూడ చాల సొమ్మునిచ్చుకోవలసి వచ్చుచున్నది. ఇవ్వలేని వారికి కోర్టుద్వారములు తెరువబడవు. ఇచ్చినవారికిగూడా న్యాయము ధర్మము దొరుకుననుమాట కల్ల. బ్రిటిషుజాతియొక్క గౌరవమునకుగూడ అవమానము దెచ్చున్యాయాధిపతు లాకోర్టులందు పరివేష్టించు చుండిరి. కంపెనీవారికోర్టులలో అమలు జరపబడిన 'క్రిమినలు లా' గవర్నమెంటు వారివలననే నిరసింపబడియున్నది. ఆధర్మము ఇంగ్లాండులోనిక్రైస్తవ జనుల కెంతతగినదో భారతీయుల కంతతగినదని చెప్పవచ్చును.

నేరవిచారణ క్రిమినలు ధర్మము సరియైనది లేకపోయినను ఒక విచిత్రపోలీసుశాఖమాత్రము కలదు. అయితే ఇది ఎట్టి సంస్థ? కలకత్తాలోను దక్షిణ వంగరాష్ట్రములోనుగల 1252 మంది ప్రజలు కామన్సుసభకు పంపిన మహజరునుబట్టి చూడగా నీ పోలీసువారు నేరములు జరుగకుండ నివారింప నశక్తులును, నేరగాండ్రను పట్టుకొనుటకును, ప్రజలను వారి ఆస్తిని సంరక్షించుటకును అసమర్థులును అగుటయేగాక నీతిధర్మములు లేక ప్రజాపీడన చేయువారుగా నున్నట్లు తేలుచున్నది. ఇక 1833 సంవత్సరపు ప్రభుత్వవిధానమువలన భారతదేశ ప్రజలలో విద్యాభివృద్ధియైన కలిగినదాయని పరిశీలించినచో నదియు లేదని తేలినది. నేటివుల విద్యకొఱకు చేయబడు ఖర్చు అతి