Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంపెనీ పరిపాలన యొక్క ఫలితములు

281


క్షేమమున కెట్లు తోడ్పడగలదు? ఈ కాలములో భారతదేశ ప్రభుత్వాదాయము ఎట్లుండెనో పరిశీలింతము.

ఇంగ్లాండుయొక్క ప్రభుత్వాదాయములో లోటుకనిపించినచో నది యొక ఘోరమైన తప్పిదముగా పరిగణింతురు. భారతదేశమువైపునకు తిరిగిచూడుడు. ఈ గడచిన పదునాలుగేండ్లలో ప్రతియేటను ఆదాయములో లోటేకనపడుచున్నది. ఈ భారతదేశ పరిపాలనావిధానము 1833లో స్థాపింపబడినప్పుడు ఆ దేశాదాయము భరింపవలసిన సైనికవ్యయము 80 లక్షల పౌనులు లేక 8 కోట్ల రూపాయలుగనుండెను. అనగా నికరాదాయములో నూటికి 49 వంతులు. ఇరువది సంవత్సరముల "అభివృద్ధియు దేశసౌభాగ్యమును" జరిగినపిదప నిప్పుడు గూడా 120 లక్షల పౌనులు సైనికవ్యయముగానుండి నికరాదాయములో నూటికి 56 వంతులనిది మ్రింగుచున్నది. 1833 లో స్థాపింపబడిన కంపెనీ పరిపాలనయొక్క ఫలితమిది! ఇట్టితరి 1853 లో మరల నీ కంపెనీకి పట్టాయొసగుట న్యాయమేనా?

ప్రజల కుపయోగించు రోడ్లు కాలువలు మున్నగు ప్రజోపయుక్త నిర్మాణములు సత్ప్రభుత్వము యొక్క ముఖ్య లక్షణములు. సాలుకు 210 లక్షల పౌనులకు పై బడిన ఆదాయముగల భారతదేశ ప్రభుత్వము, పైనచెప్పినట్టి ప్రజోపయోగకరములగు పబ్లికువర్క్సు కార్యములకొఱకు 5 లక్షలపౌనులు అనగా నూటికి 2 1/2 వంతులుమాత్రము ఖర్చుచేయుచున్నది! ఐరోపాఖండమంత పెద్దదేశమున కీ స్వల్పపుమొత్త మేమూలకు సరిపోవును? ప్రజోపయోగకర నిర్మాణములకు ఖర్చు పెట్టినట్లు