Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


నిచ్చెను. ఇట్లు న్యాయవిచారణాధికారము సాధ్యమైనంతవరకు భారతీయులవశము గావింపవలెనని యాతని ప్రధానోద్దేశము, జిల్లాలోని రివిన్యూ మేజస్ట్రీటు పోలీసు అధికారములెల్లను సంపూర్ణముగా నొకే యధికారి చేతులోనేయుంచి కలెక్టరును జిల్లాకు సర్వాధికారిగా చేయవలెనని యాతని రెండవయుద్దేశము. మొదటిపద్ధతిని సక్రమముగా నమలుజరిపి యుండినచో దేశమునకు క్షేమము కలిగియుండును గాని దానిలో కొన్ని సంస్కరణములు మాత్రమేచేసి యూరకొనిరి. రెండవదిమాత్రము పూర్తిగాజేసిరి. క్రిందియధికారుల పరిపాలనమెల్ల చెడి, జిల్లా పుచ్చియున్న నాటికాలములో జిల్లాకలెక్టరును సర్వాధికారిగా చేయుటవలన దేశమునకు కొంతలాభముకలిగినమాటవాస్తవమె గాని తరువాత దానివలన ప్రజల కమితమైన నష్టములు గల్గినవి. ప్రజలకు స్వేచ్ఛస్వాతంత్యములు లేకుండ పోయినవి.

1813లో న్యాయవిచారణశాఖను సంస్కరించుటకొరకు కంపెనీ డైరెక్టర్లు అనుభవజ్ఞులగు ఉద్యోగులను సలహా లడిగినప్పుడు వంగరాష్ట్రమున సర్ హెన్‌రీ స్ట్రాచీ, మద్రాసులో తామస్ మన్రో, బొంబాయిలో కర్నలువాకర్ గార్లు హిందూ మహమ్మదీయ పెద్దమనుష్యులను న్యాయవిచారణ శాఖలో నియమించి ఆంగ్ల ధర్మశాస్త్రములు, శాసనములు, అమలుజరిపినచో నీ శాఖ చాలవరకు చక్కబడునని సలహాల నిచ్చి యుఁడిరి. రెండువందల రూపాయిలవరకు విలువగల వ్యాజ్యముల పైన మునసబులకు విచారణాధికారమునిచ్చి వారి జీతములు ఆంగ్లేయజడ్జీల జీతములలో పదియవ వంతుదాకనైన హెచ్చిం