సివిల్ క్రిమినల్ న్యాయవిచారణ
269
III
నాటి భారతదేశ పరిపాలనలో న్యాయవిచారణ అధ్వాన్నముగ నుండెననియు సివిల్ రివిన్యూ పరిపాలన లోపభూయిష్టముగనుండెననియు అనుభవజ్ఞులగు ఆంగ్లేయోద్యోగులగు స్ట్రాచీ, మన్రో, వాకరు లింగ్లాండుకు పలుమారు వ్రాయసాగిరి. భారతదేశ పరిస్థితులనుగూర్చి 1812 లో పార్లిమెంటు ఉపసంఘమువారు ‘ఫిఫ్తురిపోర్టు' అను నొక నివేదికను ప్రకటించిరి. దీనిలోని సంగతుల వలనను, 1813 లో మన్రోయిచ్చిన సాక్ష్యమువలనను భారతదేశ న్యాయపరిపాలనలోను రివిన్యూ పరిపాలనలోను కొన్ని సంస్కరణము లవసరమని కంపెనీ డైరెక్టర్లకు కూడా తోచినది. అంతట దీనిని గూర్చి విచారించి తగు సలహా లిచ్చుటకు కర్నల్ మన్రోగారి అధ్యక్షతక్రింద మద్రాసురాష్ట్రములో నొక స్పెషల్ కమీషను నియమించిరి. మన్రో 1814 లో మదరాసులో విచారణసలిపి డిశంబరులో తన సలహాలను మదరాసు ప్రభుత్వమునకు నివేదించెను.
కలెక్టరే మేజస్ట్రీటుగా నుండవలెననియు, గ్రామపోలీసు అధికారములు గ్రామాధికారులకే యివ్వబడవలెననియు, గ్రామపంచాయితీలు పునరుద్ధరింపబడవలెననియు, "నేటివు” జిల్లాజడ్జీలు కమీషనరులు నియమింపబడవలెననియు, పట్టా రెగ్యులేషన్ లను కలెక్టరులు సమముగా అమలు జరిగించవలెననియు, ఆస్తిని జప్తుచేయు అధికారములను జమీందారులకు లేకుండ చేయవలెననియు, పొలముల సరిహద్దు (బౌండరీ) వివాదలను కలెక్టరులే పరిష్కరించవలెననియు, అతడు సలహా