256
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
త్సరముల అనుభవముగల హెడ్‌అసిస్టెంటు ఒకడు. ఏమియు తెలియని యొకరిద్దరు జూనియర్ అసిస్టెంటు లనబడు కొత్తదొరలు నుందురు. కలెక్టరుకు జిల్లాలో రివిన్యూపన్నులు వసూలుచేయు అధికారము మాత్రమేగాక పోలీసు, మేజస్ట్రీటు అధికారములును, రివిన్యూకు సంబంధించిన కేసులు విచారించు అధికారమును కూడ నుండెను. అన్ని పనులు వ్రాతమూలకముగా జరుగవలెనను నిబంధన యొకటి యుండినందునను ప్రజలకును పాలకులకును ఒకరిభాష ఒకరికి తెలియనందునను చాల చిక్కులకు కారణమగుచుండెను.
ఒక్కొక్కగ్రామములో మామూలు గ్రామోద్యోగులు గాక కలెక్టరుయొక్క అధికారముక్రింద 1500 మొదలు 2500 వరకు రివిన్యూవసూలు ఉద్యోగులు నౌకరులు పనిచేయుచుండిరి. ఈ నౌకరులకు చాలకొద్దిజీతములుండెను. కలెక్టరు మంచివాడైనను తాబేదారులు సర్వసామాన్యముగా దుర్మార్గులుగను లంచగొండెలుగను ఉండిరి. గుమాస్తాలు, డఫేదారులు, బంట్రోతులు గ్రామములలో జులుముచేసి సప్లయిలు కొట్టి లంచములు పుచ్చుకొని గ్రామస్థులను పీడించుచుండిరి. రివిన్యూనౌకరులందరును కలసి యొక్కకట్టుగా పనిచేయుచు, ఒకరి పై వారి కింకొకరు సప్లయిలు లంచములు అందచేయుచు, రైతులను పీడించుచుండిరి. 1816 లో తహశీల్దార్లకు కూడా పోలీసు అధికారము లివ్వబడెను. అంతట నీ రివిన్యూపరిపాలనలోని దురాగతములు హద్దుమీరిపోయెను. నాటికి కేవలము ఆశ్రయింపులపైననే ఉద్యోగము లొసగబడుచుండెను. ఎవ డెక్కువ శీఘ్రముగా