శిస్తులనిర్ణయము - వసూలు
255
వసూలులో నిరంకుశముగా చలాయించుచుండుటయు అతని క్రింది రివిన్యూ ఉద్యోగులు రైతులను అనేకవిధములుగా పీడించుచుండుటయు, కలెక్టరుల అధికారమునకు భయపడి ప్రజలు నోరు విప్పలేకుండుటయు తటస్థించినది. ఈ పరిస్థితులు నాటికి నేటికి నొకేతీరుగా నున్నవి.
Ill
రివిన్యూ పరిపాలన
భారతదేశ మాంగ్లేయుల వశమైన తరువాత రివిన్యూ పరిపాలనా పద్దతు లెట్లున్నవో చూపుటకు చెన్నపురి రాజధానిలోని స్థితిగతులను నుదాహరణముగ గైకొనవచ్చును.
ఈ రాజధాని వైశాల్యము ఒక లక్ష నలుబదివేల చతురపుమైళ్ళు. మొత్తము జనసంఖ్య రెండుకోట్ల ఇరువది లక్షలు. ఆనాటి కీ రాజధానిలో 20 జిల్లాలుండెను. ఒక్కొక జిల్లా వైశాల్యము రమారమి 7 వేల చతురపు మైళ్ళు, జనసంఖ్య 11 లక్షలు. ఒక్కొక జిల్లాలో 14 లేక 16 తాలూకా లుండెను. ఒక్కొక తాలూకా వైశాల్యము 300 లేక 500 లేక 1000 చతురపు మైళ్లు; ఒక్కొక తాలూకాలో నూరులగాయతు రెండువందల గ్రామములుండెను. వీనిలో 500 మొదలు 2000 పొలములు లేక మళ్ళు, ఉండెను.
జిల్లాకంతకును ప్రధానాధికారి కలెక్టరు. ఈతని క్రింద నుండు ఆంగ్లేయోద్యోగులలో జిల్లాలో నాలుగవవంతుకు సంపూర్ణాధికారియగు సబుకలెక్టరు ఒకడు. ఆరు లేక పది సంవ