పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిస్తులనిర్ణయము - వసూలు

253


జరిగినది. అందువలన వ్యవసాయము పాడై కరవు లధికములైనవి. ప్రజల దుస్థితిని గూర్చి కలెక్టర్లును రివిన్యూబోర్డువారును గూడా అనేక రిపోర్టులు వ్రాసిరిగాని లాభము లేకపోయినది. పన్నులు తగ్గింపబడలేదు సరికదా పన్నులిచ్చుకోలేని రైతులను చిత్రహింసలు పెట్టుట మితిమీరినది. దీనిని గూర్చి మద్రాసులో గొప్పఆందోళనముజరుగగా నెట్టికేలకు పార్లిమెంటువారు 1854 లో నొకవిచారణసంఘము నేర్పరచిరి. శిస్తు లివ్వలేని రైతులను తీవ్రమైన ఎదురెండలో నిలువబెట్టుట; అన్నము తినుటకుగాని దేహబాధ తీర్చుకొనుటకుగాని పోనివ్వకుండుట; కొట్లో పెట్టియుంచుట; వాని పశువులను మేతకు పోనివ్వకుండుట; వానిపైన బంట్రోతులను నిఘాయుంచుట; మనిషిని వంగియుండునట్లు కట్టివేయుట; చేతివ్రేళ్ల నొకదానిలోనొకటి దూర్చి నొక్కుట, పొడుచుట, చంపలువేయుట, పిడికిళ్లతో గ్రుద్దుట; కొరడాలతో బాదుట, పైకిని క్రిందికిని పరుగెత్తించుట; చెవులు మెలిపెట్టుట, మోకాళ్ల మడతలలో కంకరరాళ్ళు పెట్టి గొంతుకూర్చుండపెట్టుట; వంగియుండపెట్టి ఫైన పాకీవానినో మాలవానినో గూర్చుండ పెట్టుట; ఇరువురి తలలు డీకొట్టించుట; వారిజుట్లు వెనుకప్రక్క కలిపి ముడివేయుట, బండకొయ్యలు వేయుట; రైతు జుట్టును గాడిదతోకకుగాని దున్నపోతుతోకకుగానికట్టుట; బొమికలనులేక యితర అసహ్యపదార్దములను దండగా మెడలోవేయుట; ఇంకను ఘోరకృత్యములుచేయుట జరుగుచుండిన ట్లీ కమీషనువారికి విశదమైనది. ఈ వివరములనెల్ల వారు ప్రకటింపగా నిట్టివి జరుగరా దని