Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


తాకీదులు జారీచేయబడెను. ఈ విచారణ సంఘమున కే 'మద్రాస్ టార్చర్ కమిషన్' అని పేరు.

వంగరాష్ట్రమునందు శాశ్వతపైసలా (పర్మనెంటు “సెటిల్మెంటు) చేసినదిమొదలు జమీందారీలపైన ప్రభుత్వమునకు చెల్లవలసిన భూమిశిస్తు శాశ్వతముగా నిర్ణయింపబడి ఆమొత్తములకు జమీందారులే పూచీ వహించి వారు రైతులను పీడించుట ప్రారంభమైనది. ఈ అన్యాయములను గూర్చి రైతులు మొరపెట్టుకున్నను లాభములేకపోయెను. శాశ్వత భూమిశిస్తు (పేష్కసు) సరిగా చెల్లించుచున్నంతకాలము జమీందారు లెంత దౌర్జన్యముచేసినను ఏమనకుండిరి. రైతుల మొరలు వినువారులేరు. వంగరాష్ట్రమున నిట్లొకవిధముగాను, చెన్న రాజధానిలో నింకొకవిధముగాను రైతులయొక్క దురవస్థలు నానాటికి హెచ్చుచుండెను. చెన్న రాజధానిలో “రైతువారీపద్ధతి" స్థాపింపబడినది. ఈ పద్దతిప్రకారము ప్రభుత్వమే భూఖామందుగానుండెను. దొరతనమువారి భూములకు కలక్టరులే మేనేజర్లుగా నుండి భూమిని ప్రతిసాలున రైతులకు అమర్చుచుండుటయు భూమిశిస్తులు వసూలు చేయుచుండుటయు జరుగసాగెను. వంగరాష్ట్రమునవలెనే, ఈరాష్ట్రములోని కలెక్టరుయొక్క న్యాయవిచారణాధికారములు తీసివేయబడినచో అమరకపు వ్యవహారములు నెరవేర్చుటలో లోపములు కలుగునని అధికారులకు తోచినది. అందువలననే ఆ యధికారము లిచ్చట విడదీయబడలేదు. దీనిఫలితముగా కలెక్టరే రివిన్యూ ఉద్యోగియు, మేజస్ట్రీటునై రెండు అధికారములను పన్నుల