Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిస్తులనిర్ణయము - వసూలు

249


వాలిసువచ్చి తిరిగి నల్లవారినే వసూలుదారులుగా ఏర్పాటుచేసెను. వీరిపైన తనిఖీకొరకు ఆరు జిల్లాకౌన్సిళ్ళను నిర్మించెను, ఈ పద్దతి ఐదేండ్లు జరిపి జూచెను గాని లాభము లేకపోగా 1777లో తిరిగి ఏకుసాలా నిర్ణయపద్ధతి నేర్పరచెను. దీనివలన పన్నుల వసూలుకు జమీందారులు బాధ్యులుగా చేయబడిరి. వీరీపని తిన్నగా చేయుదురో లేదోయని భూములలో వీరికి పూర్వమునుండి యున్న హక్కులు తీసివేసి కంపెనీవారే వహించిరి. 1781 లో మరల నింకొక పద్ధతి అమలుజరుప బ్రయత్నించిరి. జిల్లా కౌన్సిళ్ళను తొలగించి దేశమునకంతకును ఒకే రివిన్యూబోర్డును స్థాపించిరి. కలెక్టర్లకు అనగా శిస్తు వసూలు దారులకు జీతములుగాక వసూలుచేయు శిస్తుపైన కమిషను కూడా ఇచ్చుచుండిరి. దీనివలన పన్నులవసూలులో వీరతిక్రూరపద్దతు లవలంబించుచుండిరి. ఈ కమీషను లంచముగా పరిణమించెనని కారన్ వాలిసే చెప్పినాడు. ఆ కాలమున నెలకు వేయిరూపాయిల జీతముగల కలెక్టరు సాలుకు నాలుగు లక్షలకు తక్కువలేకుండా కమిషను సంపాదించుచుండెనట!

1784 లో చేయబడిన చట్టము ప్రకారము భారతదేశ భూస్వాముల బాధలను విచారించి భూమితరములను నిర్ణయించుటకును రివిన్యూ వసూలుకు తగు నిబంధనలతో బందోబస్తు చేయవలసినదనియు దేశీయుల పూర్వాచారములను శాసనములను అనుసరించి న్యాయాన్యాయములను నిర్ణయించవలెననియు శాసింపబడెను. అందువలన కారన్ వాలిసు వెంటనే భూమితరముల నిర్లయమొకటి చేసెను. ఇదియేపర్మనెంటు సెటిల్మెంటు