250
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
(శాశ్వత పైసలా) అని ప్రసిద్దిజెందినది. ఆనాటికి భూములందుగల రైతులకు జమీందారులకు ఆక్రమణదారులకు ఏమి హక్కులున్నవో నిర్ణయించుట, పైసలుజేయుట సామాన్య కార్యముకాదు. పైగా కంపెనీవారి దివానీగిరీ కాలములోనీ ప్రాతపద్ధతులన్నియు తారుమారు లైనవి. భూమిపన్నుల వసూలు హక్కును వేలముద్వారా ఇజారాలకిచ్చు దురభ్యాస
మొకటి ప్రబలి అసలు భూమి దున్నుకొను సేద్యగానిస్థితి దుర్భరమగునట్లు ఈ దళారీ ఖరీదుదారులు ప్రవర్తించిరి.
సేద్యగాండ్రతో గాక కేవలము జమీందారులతోనే భూమితరముల నిర్ణయముచేసి పైసలు చేసికొనవలెనని కౌన్సిలులో చాలమంది యభిప్రాయము. జమీందారులే శాశ్వత భూమిపన్ను శిస్తు కంపెనీకిచ్చు పద్దతిని ఆనాడు భూములలో జమిందారులకు భూములందు వంశపారంపర్యపు హక్కులను స్థిరపరచినచో ఆ శిస్తునందు బకాయిపెట్టినచో భూములు లాగికొందుమనిగాని చెరలో నుంతుమనిగాని బెదిరించి వారి నణచియుంచవచ్చును. ఇట్లైనచో శిస్తులవసూలు సులభసాధ్య మగుననితోచినది. అందువల్లనే శాశ్వతమైనపద్ధతినే వంగరాష్ట్రమున స్థాపించుటకు నిశ్చయించిరి. ఈ పద్ధతి కంపెనీ డైరెక్టర్లు 1793లో ఆమోదించిరి. గతసంవత్సరము భూమియొక్క విలువలో పదింట తొమ్మిదవవంతుచొప్పున శిస్తులు వసూలుచేయబడెనని తేలినది. భూమియొక్క విలువలో పదునొకండువంతులలో పదివంతులు (10/11) శాశ్వతపు రేటుగా విధించిరి. ఈ శాశ్వత పైసలాకొరకు జరిగిన విచారణ చాలా అసంతృప్తికరముగా