248
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
కొన్నిగ్రామములు చేరి ఒకపరగణాగను, కొన్నిపరగణా లొక సర్కారుగను, రెండుమూడుసర్కారు లొకసుబాగా నుండెను మిక్కిలివిస్తీర్ణములగు భూములను గలిగియుండి అందలి పన్నుల వసూళ్ళకు తాము ప్రభుత్వమునకు బాధ్యత వహించువారు జమీందారులు. వీరిక్రింద తాలూకాదారులు వీరిక్రింద రైతులు నుండిరి. జమీల కధిపతులే రాజులు. ఇంగ్లీషు కంపెనీవారు దివానీగిరీ పొందగానే కేవలము పన్నులు తాలూకుసొమ్మును జమకట్టుకొను పనిని చేసికొనవలసినదనియు వసూలుపరచు వ్యవహారములన్నియు దేశీయులకు వదలవలసినదనియు కంపెనీ డైరెక్టర్లు వీరి కాజ్ఞాపించిరి. వీరు మొదట నట్లే చేసిరి. కాని విదేశీయుల కీ పన్నులు తీసికొను హక్కుకలుగగానే ప్రాతపద్ధతులు మర్యాదలు, ధర్మములు, నశించి పన్నుల వసూలు కఠినముగా చేయిబడుట సహజమే. 1769 లో నీ కంపెనీవారు తమ భూముల శిస్తువసూలు తృప్తికరముగా లేదని దేశీయ వసూలుదారులపైన ఆంగ్లేయ సూపరువైజర్లను పెట్టిరి. 1772 లో వారన్ హేస్టింగ్సు రివిన్యూవసూలు విధానమును పూర్తిగా మార్చివేసెను. దేశీయ కలెక్టర్లను తీసివేసి ఆంగ్లేయ కలెక్టర్లను నియమించెను. కలకత్తా కవున్సిలును రివిన్యూబోర్డుగాజేసి కలెక్టర్లపై నధికారిగా నియమించెను. క్రొత్తయుద్యోగులను చాలమందిని నియమించెను. భూమితరములనిర్ణయమును గూర్చి విచారించుటకొరకు నలుగురు కౌన్సిలు సభ్యులను సంచారముచేయుట కంపెను. దేశీయోద్యోగులకు పనులుపోయెనే గాని దీనివలన కంపెనీకి కలిగిన లాభములేదు. పంట హెచ్చలేదు. 1774 లో కారన్