పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


వ్యాపార యిజారా రద్దుచేయబడెను. నారివ్యాపారపు సొత్తుయావత్తూ ఖరీదుకట్టబడి భారతదేశపు ప్రభుత్వ కాతాకు ఖర్చు వ్రాయబడెను. భారతదేశములో 'స్వేచ్ఛా వ్యాపార' పద్ధతి నెలకొల్పబడెను.

ఇక భారతదేశ రాజ్యాంగవిషయమున పార్లమెంటువారి ప్రభుత్వముక్రింద వారి ప్రతినిధులుగా భారతదేశమును పరిపాలించుట కెవరో ఒక రుండవలసిన ఆవశ్యకతయున్నందున కంపెనీవారినే అట్టి ప్రతినిధులుగానుంచి భారతదేశములో వా రేర్పరచియుంచిన పరిపాలనాయంత్రము ద్వారానే పార్లమెంటువారీ దేశమును పరిపాలింప నిశ్చయించిరి. ఇట్లు కంపెనీవారి రాజకీయాధికారమును పలుకుబడియు నిలుపబడెను. 1853లో వారికి సన్నదును మరల నొసగునప్పుడుకూడా పార్లమెంటువా రీ పద్ధతిప్రకారమే కంపెనీకి పట్టానిచ్చిరి. ఇందువలన కంపెనీ పరిపాలనలో నెట్టి అంతరాయముగాని మార్పుగాని లేక ప్రాతపద్ధతులప్రకారము నిరంకుశపరిపాలనము జరుగసాగెను.

1833 వ సంవత్సరపు ఇండియారాజ్యాంగచట్టమే నేటి బ్రిటిషుప్రభుత్వవిధానమునకు పునాదియని చెప్పవచ్చును. భారతదేశపరిపాలన, సివిలు మిలిటరీ ప్రభుత్వాధికారములు, ఆ దేశప్రభుత్వమును నడుపుఅధికారము, దాని అదుపు ఆజ్ఞలు, పై తనిఖీ అధికారములు, ఇంగ్లాండుదేశపుపార్లమెంటువారివే యని శాసింపబడెను. భారతదేశప్రభుత్వభారము కార్యాలోచనసభతో కూడిన గవర్నరుజనరలు నందు నెలకొల్ప