రాజ్యాంగ నిర్మాణము
237
నెపోలియను విజృంభించుచున్నంతకాలము భారతదేశములోని రాజు లతనితో కుట్రచేయుచుండిరను మిషపైన వెలస్లీ వారిపైన దాడి వెడలుచు వారి రాజ్యములను కలుపుకొనుచుండెను. తరువాత హేస్టింగ్సుజరిపిన దౌర్జన్యముల కెట్టి కారణమును కనబడదు. నిజముగా 1813 వ సంవత్సరపు చట్టముయొక్క ఉద్దేశములను నెరవేర్చుటకే ఈ రాజ్యాక్రమణలు చేయబడెననుట కెట్టి సందియమునులేదు.
V
1833 వ సంవత్సరపు కంపెనీ ప్రభుత్వ రాజ్యాంగచట్టము.
1833 వ సంవత్సరమునాటికి భారతదేశములో తూర్పు ఇండియాకంపెనీవారు శాశ్వతయిజారాగా ప్రత్యేకముగా వర్తకముజేయు వర్తకులును మఱియు దేశమును పరిపాలించు ప్రభువులునై యుండిరి. వీరి రాజకీయాధికారములు వ్యాపారాభివృద్ధికొర కుపయోగింపబడుచుండుట, దుష్పరిపాలనము ప్రబలుట, ఇంగ్లాండులో నందరికిని తెలియును. అయితే చేయునదేమి? పదివేలమైళ్ల దూరముననున్న భారతదేశ వ్యవహారముల నొక్కమారుగా చక్కబెట్టుటెట్లు? ఇరువదేండ్ల కొక్కమారు కంపెనీ సన్నదును మరల జారీచేయునప్పుడు ఈ సమస్య పార్లమెంటులో చర్చకు వచ్చుచుండును. ఇట్లు 1833 లో నింకొకమారు చర్చకువచ్చెను. కంపెనీ పరిపాలన తీవ్రముగా విమర్శింపబడెను. దీని ఫలితముగా నొక రాజ్యాంగచట్టము చేయబడెను. భారతదేశములో నీ కంపెనీవారికివ్వబడిన శాశ్వత