రాజ్యాంగ నిర్మాణము
239
బడెను. ఈకార్యాలోచనసభలో నలుగురు సామాన్యసభ్యు లుందురు. వారిలో ముగ్గురను నియమించు అధికారము పూర్తిగా తూర్పు ఇండియాకంపెనీ డైరెక్టర్ల కొసగబడెను. నాల్గవ సభ్యుని నియమించుటలో నింగ్లాండురాజుయొక్క సమ్మతి పొందవలెను. ఈనాలుగవ సభ్యుడు దేశములో శాసనములు చేయునప్పుడు కార్యాలోచనలో పాల్గొనునట్టి 'లామెంబరు'. ఇంగ్లీషురాజు ఆమోదమునకు లోబడి భారతదేశ గవర్నరు జనరలును సర్వసేనానినిగూడా కంపెనీ డైరక్టర్లు నియమింతురు. ఈ సభాయుతుడగు గవర్నరుజనరలుకు భారతదేశమునకు కావలసిన చట్టనిర్మాణము చేయు అధికార మొసగబడెను. పూర్వ మిట్టి శాసననిర్మాణ అధికారము లేదు. భారతదేశమున చేయబడినశాససవిధులు “రెగ్యులేషను” లనబడుచుండెను. ఇప్పుడుగూడ పార్లమెంటు అధికారమునకు విరుద్ధముగా చట్టములు చేయరాదు.
భారతదేశములో సక్రమమైన న్యాయవిచారణ పద్ధతి నేర్పరచుటకు, కోర్టులు స్థాపించుటకు, వాని అధికారము నిర్ణయించుటకు అందమలు జరుగవలసిన న్యాయధర్మములు నిర్ణయించుటకు ఒక కమిషను సంఘమును నియమించుటకు గవర్నరు జనరలు కధికార మీయబడెను. సివిలు సర్వీసు ఉద్యోగముల విషయమున భారతదేశమునందు కంపెనీవారి కొలువులో నుండవలసిన ఉద్యోగుల సంఖ్యను నిర్ణయించుచు ప్రతిసాలున ఒక అంచనా యేర్పాటు గావింపబడెను. ఇదియే నేటి ఉద్యోగవర్గ నిబంధనలకు దారిజూపెను. కేవలము భారతీయుల జాతి