రాజ్యాంగ నిర్మాణము
235
చలామణి చేసికొనగలుగుట కే తమ రాజ్యమును విస్తరింపజేయ దలచిరి. పూర్వము 1793 లో నీ కంపెనీకి పార్లి మెంటువారు పట్టా నొసగునప్పుడు దేశాకమ్రణచేయుటయు రాజ్యమును వృద్ధిజేయుటయు ఆంగ్లజూతియొక్క ఉద్దేశములకు గౌరవమునకు నీతికిని గూడ విరుద్ధమని స్పష్టీకరించి యుండిరి. 1813 లో మరల పట్టానొసగు సందర్భములో నీనియమమును తీసివేసిరి. దీనివలన నిప్పటి కప్పుడే ఆంగ్లేయులకు వర్తక సామ్రాజ్యమును స్థాపించవలెనను కాంక్ష యుదయించినట్లు నిశ్చయించ వచ్చును. ఈ కాంక్షను ఉద్దేశమును పురస్కరించుకొని ఆంగ్ల పరిపాలకులు భారతదేశములోని స్వదేశరాజులను నవాబులను ఏదో మిషపైన నయముననో భయముననో మోసముననో పదభ్రష్టులజేసి రాజ్యములను లాగికొని బ్రిటిష్ ఇండియాను వృద్ధిజేయుచుండిరి. కేవలము వర్తకలాభము కొరకే రాజ్యాక్రమణము నారంభించిరను సంగతి 1813 లో సర్ తామస్ మన్రో చెప్పిన మాటలవలననే తెలియగలదు. "కంపెనీవారి బలమువలన మనము సంపాదించిన రాజకీయాధిపత్యమే భారతదేశములో మనవర్తకముయొక్క అభివృద్ధికి గారణముగ నున్నది. ఈ రాజకీయ బలము మనకు లేనిచో స్వదేశరాజులు మనవర్తకమును పెరుగనీయరు. టిప్పు సుల్తానువంటివా రసలే జరుగనీయరు." ఈ కారణము వలననే రాజ్యమును పెంచిన వెలస్లీ హేస్టింగ్సులను పార్లిమెంటువారు గౌరవించి బహూకరించిరి.
1813 వ సంవత్సరపు పట్టాలో నింకొక ముఖ్యసూత్రము