236
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
కూడా యిమిడియున్నది. ఆంగ్లేయ క్రైస్తవ మిషనరీల యాధిపత్యమునకుగూడ ఇది పునాది. కంపెనీవారు మొదటినుండి
భారతదేశములోని మతములతో తాము జోక్యము కలిగించు కొనమని పలుకుచుండిరి. ఈమాటలు కేవలము బూటకములని 1813 లో పార్లిమెంటువారి చట్టమువలన తేలినది. భారతదేశ ప్రభుత్వము భరింపవలసిన వ్యయములో సాలుకిరువది లక్షల రూపాయిలు క్రైస్తవమతబోధకుల శాఖయొక్క ఖర్చుగా చేర్చబడినది. ఇట్లే కంపెనీ ప్రభుత్వము క్రైస్తవ ప్రభుత్వమేయను సంగతి బయల్పడినది. లేనిచో హిందూమహమ్మదీయ మతములకు లేని పోత్సాహ మీక్రైస్తవ మతమున కేలనొసగవలెను? ఇప్పటిలగాయతు ఆంగ్లేయ క్రైస్తవ మతబోధకులకు భారతదేశ ప్రభుత్వమున గొప్ప పలుకుబడి లభించినది. పాఠశాలలందు బైబిలుప్రవేశ పెట్టుటయు ప్రజలను ఒత్తిడిచేసి తమమతములో కలుపుకొనుటయు ప్రారంభించిరి.
ఆంగ్లేయు లీ దేశమునకు విరివిగా వలసవచ్చునట్లు చేయుటకు వారికి వృత్తులు కల్పించుటకు వలసిన అవకాశము గూడ 1813 వ సంవత్సరపు పట్టావలన కలుగజేయబడెను. ఇదికూడా పార్లమెంటువారు ఆలోచించి చేసినపనియె.
ఈ చట్టము శాసింపబడిన వెంటనే ఆంగ్లేయవర్తకులు తండోపతండములుగా నీ దేశమునకువచ్చి మనవారి రుచులను అవసరములను జాగ్రత్తగా కనిపెట్టి అందు కనుగుణములగు సరకులను తయారుచేసి మన పట్టణములలో వెదజల్లసాగిరి.