పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

ఇంగ్లాండువారి లాభముకొరకు భారతదేశమును పరిపాలించు పద్దతి 1813 లో తూర్పు ఇండియా కంపెనీ కివ్వబడిన పట్టాలో లిఖితరూపము దాల్చినది. భారతదేశ పరిశ్రమలను నాశనముచేయు విధానము 1813 వ సంవత్సరముననే ప్యారంభమైనదని చెప్పవచ్చును. స్వేచ్చా వ్యాపారపద్ధతి యను పేరున భారతదేశములోనికి ఇంగ్లీషుసరకులను ఎట్టి సుంకములు లేకుండా దిగుమతిచేయు విధానము నీ పట్టానిచ్చునప్పు డింగ్లీషు పార్లమెంటువారు శాసించిరి. అందువలన ఇంగ్లీషు సరకులను భారతదేశీయులకు బలవంతముగా అంటగట్ట గలిగిరి. భారతదేశ దారిద్ర్య మానాటితోనే మొదలుపెట్టినది.

ఈ పట్టాను జారీచేయునప్పుడే ఆంగ్లేయరాజ్య తంత్రజ్ఞులు భారతీయులను సుఖాసక్తులుగను భోగలాలసులుగను త్రాగుబోతులుగను చేయదలచి అందుకు వలసిన ఏర్పాటులు చేయ నిశ్చయించిరి. ఆ పట్టా నొసగునప్పుడు చేయబడిన విచారణలో ధనవంతులగు నేటీవులు ఇంగ్లీషు భోగద్రవ్యములను గొనుచున్నారా? లేదాయని విచారించి యుండిరి. భారతీయుల కీదుబారాతనము దుర్వ్యసనము లలవాటుగానిదే నాంగ్లేయ వస్తువులను గొనుటయె తటస్థించదని వా రెఱుగకపోలేదు. అందువలననే ముందుగా నాంగ్లేయు లీ దేశ పరిశ్రమలను నాశనముజేసిరి. నా డీ యాంగ్లేయుల దురుద్దేశమును మనవారు గ్రహించి యున్నచో నాడే బ్రిటీషువస్తు బహిష్కారోద్యమమును ప్రారంభించి యుందురు.

ఇంగ్లీషు పార్లిమెంటువారు తమ సరకులను విరివిగా